మదన సుందరి మొదటి భాగం

మదన సుందరి మొదటి భాగం

మదన్ ఒక పెద్ద డైరెక్టర్. అతని సినిమాలన్నీ సూపర్ హిట్ లే…. ఇప్పుడు అతను కొత్తగా ఒక సినిమా తియబోతున్నాడు దాని కోసం హీరోని, మిగతా ఆర్టిస్ట్ లని అందరిని బుక్ చేసుకున్నాడు కూడా… కానీ అతనికి హీరోయిన్ దొరకడం చాలా కష్టంగా మారింది. అతను వెతకని హీరోయిన్ లేదు, దాదాపు ఇండ్రస్ట్రి లో ఉన్న హీరోయిన్ ల అందరితో అతను సినిమాలు తీసాడు, దాంతో ఇప్పుడు తీయబోయే కొత్త సినిమాలో ఒక కొత్త హీరోయిన్ కోసం చూడడం చేస్తున్నాడు.

బాలివుడ్ హీరోయిన్ లు అతనికి ఎందుకో నచ్చారు, ఇంకా కోలివుడ్ తో సహా ఎక్కడెక్కడో వెతికినా కూడా తన కథకి సరిపోయే హీరోయిన్ దొరకడం లేదు. దాంతో పెద్ద చిక్కే వచ్చి పడింది అతనికి. అటు నిర్మాతలకి, ఇటూ హీరో గారికి కూడా చాలా చిరాకుగా ఉంది. తనకి కథ చెప్పి ఇప్పటికి రెండు నెలలు అవుతుంది. అటూ హీరోయిన్ దొరకడం లేదని తను వెరే సినిమానైనా ఒప్పుకుంటానంటే వద్దు అంటున్నాడు. అలా అని షూటింగ్ మొదలు పెడతాడా అంటే అదీ లేదు. తనని వేరే సినిమా చేసుకోనివ్వడు ఇటూ షూటింగ్ మొదలు పెట్టనివ్వడు.

ఇలా అయితే ఎలా అని తన తల పట్టుకొని కూర్చున్నారు ఫేమస్ హీరో గోపి. చేసేదేంలేక లేక ఇంట్లో కూర్చొని బీర్ల మీద బీర్లు తాగుతూ మదన్ ని అమ్మనా బూతులు తిట్టుకుంటూ తనని మదన్ దగ్గర ఇరికించిన తన మేనేజర్ ని, ఆ డైరెక్టర్ ని తనకు పరిచయం చేయించిన మదన్ మేనేజర్ ని రమ్మని ఫోన్ చేసాడు గోపి. ఆ మేనేజర్ రావాలి వాణ్ణి నేను ఫుట్ బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటానంటూ బీర్లమీద బీర్లు తాగుతూ చిన్న చెడ్డి వేసుకన్న గోపి తొడలమీద దోమలు కుడుతున్నా వాటిని నలిపి పారేస్తూ కసి గా అనుకున్నాడు.

ఆ నలిపిన దోమల్ని అదే చేత్తో బీరలో వేసుకొని కలుపుకొని తాగుతూ పంటి కిందికి అప్పటివరకు అక్కడే తిరిగిన ఈగలువాలిన జీడిపప్పుని దాంతో పాటు బాగా మాడిన ఈగల్నికుడా పరపరా నములుతూ అనుకుంటున్నాడు కసిగా…. ఆ ,మేనేజర్ గాడిని చంపిపాడేస్తానంటూ కసికసిగా ఈగల్ని నముల్తూ అదే చేతిని ముక్కులో పెట్టుకుంటూ ఆ ఘాటుకు వచ్చిన తుమ్ములు తుమ్ముతూ పడిన చీమిదిని జీడిపప్పుతో పాటు నోట్లో వేసుకుంటూ ఆ మేనేజర్ మీద చాల కోపంగా ఉన్నాడు.

అతని వాలకాన్ని చూసిన గోపి గారి మేనేజర్ ముకుందం, ముక్కు మూసుకొని బాస్ తాగిన గ్లాస్ లోని చుక్కలని తన గ్లాస్ లో నింపుకుంటూ గ్లాస్ నిండగానే తన కడుపులోకి పంపిస్తూ బాస్ నమిలి ఊసినా ఉషిల్ల లాంటి ఈగల్ని ఏరుకొని తింటూ బాస్ కు ఉన్న కోపాన్ని ఇంకా ఎగదోస్తున్నాడు ముకుందం.

తనకు లాభమేంటి అలా చెయ్యడం వళ్ళ అప్పుడెప్పుడో ఈ హీరో గారి దగ్గర కుడురుకోనప్పుడు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా తామిద్దరూ ఉన్న సమయంలో, తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేని సమయంలో ఎవేరో కాల్చి పారేసిన సగం ఆరిపోయిన బీడిని ముకుందానికి ఇవ్వకుండా మొత్తం పిల్చేసిన సదానందం అంటే చాల కోపం ముకుందానికి. పాపం ఆ సంగతి సదానండానికి తెలియదు ఎందుకంటే సగం ఆరిపోయిన బీడీ కోసం ముకుందం అంతలా చూసాడని అప్పుడు ముకుందానికి తెలియక అలా కాల్చేసాడన్నమాట.

ఇప్పుడా సదానందం వస్తే సగం బీడీ పగ కూడా కలిపి తీర్చుకోవాలని అనుకుంటున్నాడు ముకుందం ఇప్పుడు. అలా వాలిద్దరూ బీర్లు తాగుతూ నిక్కర్లు వేసుకొని కూర్చున్నపుడు [నగ్నంగా కాదు]. బయట కారు ఆగింది. అందులోంచి తల బయట పెట్టిన సదానందం పల్లీకిలించి గేటు తెరవమని అన్నాడు సెక్యూరిటీతో….

సెక్యూరిటీ కి గోపి గారు ఏమి చెప్పకపోవడంతో అంటే పలానా వారు వస్తేనే గేటు తెరాలని యజమాని చెప్తారు కదా అలా అన్నమాట. అలా చెప్పకపోవడంతో సెక్యూరిటీ గోపి గారికి ఫోన్ చేసాడు. అది మన మేనేజర్ ముకుందం లిఫ్ట్ చేసి కాసేప్యు సదానందాన్ని ఏడిపించాలని, తానూ చెప్పెంతవరకు గేటు తీయవద్దని చెప్పాడు సెక్యూరిటీకి.

ఇంకా సదానందం రాకపోవడంతో, నెలరోజుల కోసం తెచ్చిన బీర్లు ఒక్కరోజే కర్చైపోతుండడం అందులోనూ తనకన్నా ఎక్కువు తన మేనేజర్ తన బీర్లు తాగేయడం చూసిన గోపి సదానందానికి ఫోన్ చేసాడు తిరిగి. సదానందం ఫోనెత్తి అయ్యో సర్ నేను మీ గేటు బయటే ఉన్నాం మీ సెక్యూరిటీ వాడు నన్ను లోపలి రానివ్వడం లేదు అంటూ ఏడుపు గొంతేసుకొని చెప్పాడు.

దాంతో అనుమానంగా ముకుందం వైపు చూసాడు గోపి. సెక్యూరిటీకి ఫోన్ ఇవ్వండని అతనికి లోపలి పంపండి అని చెప్పి ఫోన్ పెట్టేసి ముకుందం వైపు తిరిగాడు అప్పటికే ప్రమాదాన్ని గ్రహించిన మన ముకుందం అక్కడినుండి ఎప్ప్పుడో పారిపోయాడు అది చూసి పళ్ళు పటపటా కొరికాడు గోపి. ఆ తర్వాత అవి నిజం పళ్ళు కాదని కట్టుడు పళ్ళని గుర్తొచ్చి కొరకడం మానేసి సీరియస్ గా మొఖం పెట్టి గోడవైపుకు కూర్చున్నాడు.

ఇంతలో సదానందం వగరుస్తూ వచ్చాడు. అదేంటి వగరుస్తున్నావ్ అన్నాడు గోపి అదోలా చూస్తూ…… అయ్యా తమరి కుక్కలు నా పిక్కలనేక్కడ లట్టుక్కుమంతాయోనని భయంగానే వస్తున్నా అంటూ అక్కడున్న కుర్చీలో కూర్చోబోయాడు సదానందం. వెనక నుండి వచ్చిన ముకుందం అక్కడున్న కుర్చీని పక్కకు లాగడంతో కూర్చోబోయి కిన్దిపడ్డాడు సదానందం.

అది చూసిన గోపి గారు కిసుక్కున నవ్వడంతో అతని పల్లసేట్టు ఊడి కింద పడింది. అప్పుడే అక్కడికి వచ్చిన గోపిగారి కుక్కగారు, ఆ పళ్ళ సెట్టుని చూసి ఇదేదో కొత్తరకం మాంసం ముక్క అని అనుకోని గబుక్కున తన నోటితో దాన్ని పట్టేసింది. అది చూసిన గోపి గారు తన నవ్వుని వెంటన్ ఆపేసి కుక్క వెంట పడ్డాడు తన పళ్ళ సెట్టు కోసం.

ఆ పళ్ళ సెట్టు గురించి ఎదో చెప్పాలని వచ్చిన సదానందం చేయికున్న బ్రాస్లెట్ పిన్ను గోపి గారి నిక్కరుకు చిక్కింది. సదానందం వెళ్ళకుండా అడ్డుపడాలనుకున్న ముకుందం కాలు కున్న జోడు సదానందం వేసుకున్న సైండీల్స్ లో ఇరుక్కుంది అలా ఒకరి తర్వాత ఒకరు ఆ కుక్క వెంట పడ్డారు పళ్ళ సెట్టు కోసం.

ముందు గోపి గారి కుక్క గారు, ఆ తర్వాత గోపి గారు, ఆ తర్వాత సదానందం, సదానందం వెనక ముకుందం. ఇలా గోపి పల్ల సెట్టు కోసం సదానందం గోపి నిక్కర్లో ఇరికిన తన చేయ్యికోసం సదానందం సైన్ డీల్స్ లో ఇరుకున్న తన జోడు కోసం ముకుందం అలా పరిగెత్తుతూనేన్నారు. అలా వారికి పరిగేత్తించిన గోపి గారి కుక్క ఆ తర్వాత వారిని గుర్రు మణి చూసింది.

అదెక్కడ కరుస్తుందోనని వారు దాని దగ్గరికి వెళ్ళకుండా రెండడుగుల దూరంలో ఆగిపోయారు. గోపి గారు ఆయాసం తీర్చుకుంటూ అమ్మ తల్లి నాదేగ్గర ఆ ఒక్క పళ్ళ సెట్టే ఉందే దయచేసి దాన్నేమి చెయ్యకు. కావాలంటే బయటకి వెళ్ళి ఇంకోటి తెచ్చుకునే వరకైనా దాన్ని నాకు ఇవ్వవే అని అంటూ బతిమాలుతున్నాడు కానీ గోపి గారి కుక్క గారు గోపి మాటలని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ పల్ల సెట్టు ఏ రకమైన మాంసమో తెలియక దాన్ని కొరికి కొరికి తోలు ఊడిరాకపోవడంతో దానికి కూడా విసుగొచ్చేసి దాన్ని అక్కడే పడేసి గోపి గారిని గుర్రుగా చూస్తూ ఆ పల్లసెట్టుని మూతితో తోసుకుంటూ వెళ్లి దాన్ని తీసుకొని వెళ్ళి స్విమ్మింగ్ ఫూల్ లోని నీళ్ళు వెళ్ళే మురికి గుంటలోకి పారవేసింది.

అది చూసిన గోపి గారు వెంటనే రేయ్ కాముడు అంటూ గట్టిగా అరిచాడు దాంతో కిచెన్ లో దాచుకున్న జీడిపప్పుని దొంగతనంగా తింటున్న కాముడు నోట్లో ఉన్న జీడిపప్పుని గట్టిగ ఊసాడు. అది వెళ్లి అక్కడే నోరు తెరుచుకొని పడుకున్న పని మనిషి రత్తాలు నోట్లో పడింది. నోట్లో ఎదో పడగానే అలువాటి ప్రకారం గబుక్కున మింగేసింది.

అది చూస్తున్న కాముడికి అయ్యగారి గర్జన కాదు కాదు పిలుపు కాదు అరుపు వినిపించి గబా గబా పరిగెత్తాడు. పరిగెత్తుతూ వెళ్తున్న కాముడు పంచ సోఫాకి ఉన్న మేకుకి చిక్కి మొత్తం ఊడిపోయింది. అదేమీ గమనించని కాముడు వెళ్ళి గర్జించిన అయ్యగారి ముందు నిల్చున్నాడు. వాడిని,వాడి అవతారాన్ని చుసిన, ముగ్గురూ కేకలు పెట్టి కింద పడిపోయారు మూర్చ వచ్చి.

అది చుసిన కాముడు అక్కడే ఉన్న స్విమింగ్ ఫూల్ లోని నిల్లు తీసి ముగ్గురి మోఖల మిద చల్లాడు. ఆ నీరు నోట్లో పడగానే చప్పరించి, అవంత తీయగా లేకపోవడంతో గబుక్కున లేచి కూర్చున్నారు ముగ్గురూ…… ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలి అంటే మదన సుందరి కథ రెండో భాగంలో చదవండి…..

– భవ్య చారు

Related Posts