మధ్య తరగతి మనిషి

మధ్య తరగతి మనిషి

ఎన్నో ఆశలతో రోజును మొదలెట్టి

చివరికి అదే రోజు నిద్ర సమయానికి నిరాశతో

ముగిస్తూ మరలా ఓ చిన్న ఆశతో

పోగుచేసుకుంటు రోజులను సాగదీస్తూ

ముందుకు వెళుతుంటాడు…

ఎన్ని సమస్యలు చుట్టుముట్టిన అన్నింటా

మొక్కవోని పట్టుదలతో ఆ సమస్యలను

ఒక్కోసారి పరిష్కరించుకుంటు మరో

ప్రయత్నంలో వాటిలో కూరుకుపోతు జీవితాన్ని

వెల్లదిస్తుంటాడు…

సమాజపు వెక్కిరింపులను…

బంధువుల చీత్కారాలను…

అన్నింటినీ భరిస్తూ

ఓ నాటికి తన విజయానికి ఉపయోగించుకుంటు

తనని తాను నిలబెట్టుకుంటు ఓ ప్రక్క

కుటుంబాన్ని నిలబెడుతూ…

తన ప్రయాణాన్ని తాను కొనసాగిస్తాడు…

– ఇట్లు ఓ మధ్య తరగతి మనిషి (గోగుల నారాయణ)

Related Posts

1 Comment

Comments are closed.