మధ్యతరగతి మనోగతం

మధ్యతరగతి మనోగతం 

మధ్యతరగతి మనోగతం

ఎన్నో ఆశలున్న మరెన్నో ఆకాంక్షలున్న
అన్నీ దాచుకున్నా హృదిలోయలో…!
అందనంత ఎత్తులో అనుబంధాలు
ఎందుకంత దూరాలు చేసేను విధి…?
సగటు జీవి కోరికలకు కళ్లాలు వేసేను
ఆ మాయదారి పక్షపాతి…!

తప్పుచేయకున్నా నిందమోసే సీత
ప్రశ్నించకపోవడం తన తప్పా…?
అణిగిమణిగి ఉంటే మంచి నేరమా…?
అబద్దానికి నోరుంటే అన్నీ నిజాలేనా…?

కార్మిక కర్షక వ్యధలను ఎలుగెత్తిన శ్రీ శ్రీ
దైవాన్ని ప్రశ్నించలేదని ఈ వైవిధ్యమా…?

-వింజరపు.శిరీష
 కాళీవిశ్వనాధ్ శ్యామ్

సమాజమా! Previous post సమాజమా!
ఓటమి సంతకం Next post ఓటమి సంతకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close