మధుర జ్ఞాపకాలు
బాల్యంలో ఆడిన ఆటలు.
మితృలతో గడిపిన క్షణాలు.
నాడు జరిగిన సంఘటనలు.
ఇవే నేటి మధుర జ్ఞాపకాలు.
మనకు నిజమైన సంపద
మన మధుర జ్ఞాపకాలు.
ఎన్ని జ్ఞాపకాలను పోగేస్తే
మనం అంత ధనవంతులం.
జ్ఞాపకాలను పోగేసుకుందా.
జీవితంలో నెమరేసుకుందా.
మంచివి ఆనందాన్ని ఇచ్చేను.
చెడువి దుఃఖాన్ని కలిగించేను.
వీలైనన్ని మంచి జ్ఞాపకాలను
పోగేసుకుని ఆనందపడదాము.
ఆనందాన్ని అందరికీ పంచుదాం.
-వెంకట భానుప్రసాద్ చలసాని