మగువ – అలక

మగువ – అలక

అలక భూనిన అందమైన మహిళ..
అది ఆమె అందానికి అద్దిన కళ..
పెదవి విరుపులతో విరిసిన వేళ..
ముసి ముసి నవ్వులతో మురిసెను.. భళా..

మగని మోములో కంగారు.. ఓ పారి
చవిచూచిన పడతుల మదిలో పారెను సిగ్గుల గోదారి..
ప్రియుని బిత్తర చూపులకు..
ప్రియురాలి విజయానందంకు..
అలకే అలంకారం

ప్రతి అలకకు లేదు కారణం..
ఇది ప్రేమానురాగాల మధ్య జరిగే రణం..
అందుకై తమ హృదయాలు అర్పణం…

అలకలతో ఆడవారికి అన్నీ సాధ్యం..
వారి మనసు లోతు తెలియుట అసాధ్యం..
కనుకనే అలకపై స్వారీ వద్దు..
అలక లో ‘సారీ’ నే ముద్దు..

స్త్రీ మనసు అలకకు పుట్టినిల్లు.
అవి వారి స్వచ్ఛమైన మనసు వాకిళ్లు..
కొండంత ప్రేమ కు అలకలే ఆనవాళ్లు..
ప్రేమకై పరితపించు పసి హృదయపు లోగిళ్లు..

– కిరీటి పుత్ర రామకూరి

Related Posts