మహానగరం
మహానగరాలు మానవాళి
నిర్మించుకున్న ఆశల సౌధాలు
మహానగరపు జీవనానికి సమాయత్తమైవచ్చే
సామాన్యులు ఎందరో
ప్రతిభగలవారికి పలికించే
బంగారు ఖజానా
బహువిదాల స్నేహ హస్తం
అతిథులకు అందాలొలికించే ఆకాశ హర్మ్యాలు
అమోఘమైన సుందర కట్టడాలు
కాంతులీనే దీపకాంతుల
వరుసలు దేదీప్యమైన వెలుగు
జిలుగుల రేఖలు
అందరికీ ఆశ్రయం కల్పించే
మహానగరాల వినూత్న శైలి
చరిత్రకు నిదర్శనమై చెరగని
సౌందర్యాలకు చూడ చక్కని
ప్రదేశాల సాక్షాత్కారం
సంకల్పాన్ని మణికట్టుకు కట్టుకొని మహానగర జీవన
యానానికి మొదటి మెట్టుగా
వినూత్న జీవనశైలికి
కలల సాఫల్యానికి దిక్కుమొక్కుగా మహానగరదారి సామాన్యుల పాలిట వరంగా
సకల సంస్కృతుల మేళవింపు
సామరస్యాల పరిమళింపు
హద్దులు లేని అవకాశాలు
విస్తుపోయే యాంత్రిక సవాళ్లు
అగచాట్ల అనుభవాలు
కొత్త చిట్టాల కోరికలు
మహానగర జీవన గమ్యం
విలాసాలకు చిరునామా
నిత్య విశేషాల హంగామా
శ్రమజీవుల కర్మాగారం
సరికొత్త ఆవిష్కరణల మేళవింపు
మహానగరాలు మనిషి మేధస్సుకు ప్రత్యక్ష నిదర్శనం
ప్రపంచ ఖ్యాతికి నమూనాగా
మహానగరాలు మనమే నిర్మించుకున్న అభివృద్ధి సౌధాలు
మహానగరాలు దేశ ప్రగతికి
మూలాలు అందుకే మనందరి మణిహారాలు మరి……
_ జి జయ