మహాత్ముడు

మహాత్ముడు

స్వర్గంలో ఉన్న మహాత్మునితో దేవతలు ” మీ నాయకత్వంలో ఎంతో మంది ప్రజలు భారత దేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. ప్రజలందరూ త్యాగాలు చేసి సాధించిన ఆ స్వాతంత్ర్యాన్ని ఇప్పటి ప్రజలు సద్వినియోగం చేస్తున్నారు అని మీరు భావిస్తున్నారా?” అని అడిగారు.

” దేవతలారా, అప్పటి ప్రజలు తమ బాధ్యతగా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసారు. దేశం పట్ల తమ దేశభక్తిని చాటారు. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం అన్ని రంగాల్లో మన దేశం అభివృద్ధి చెందుతుంది అని వారు కలలు కన్నారు. వారి కలలను నిజం చేయాల్సిన బాధ్యత నేటి ప్రజలపై ఉంది” అన్నారు మహాత్ముడు. అప్పుడే అటుగా వెళ్తున్న గాడ్సే ఆ మహాత్మునికి నమస్కరించి ” మహాత్మా, నేను తప్పు చేసానయ్యా.

నీ లాంటి మంచి వ్యక్తిని నేను కాల్చి చాలా పాపం చేసానయ్యా. నన్ను క్షమించగలరా” అని అడిగాడు. అప్పుడు గాంధీ” నాకెవరిపైనా కోపం లేదు. నువ్వు చేసింది తప్పు అని నీకనిపించింది. ప్రతి ఒక్కరు తమ తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపం చెంది మంచిగా మారాలనే నా కోరిక” అన్నారు మహాత్ముడు.

అలా అంటూ ఆయన ముందుకు వెళ్ళారు. నేను వెనకనుండి ” మహాత్మా మీకు జేజేలు”అని గట్టిగా అరిచాను. అప్పుడే నా భార్య”ఏమిటండీ నిద్రలో కలవరిస్తున్నారు”అంది. జరిగినదంతా కలలో జరిగింది అని అప్పటికి కాని నాకు తెలియలేదు. గాంధీ జయంతి రోజు ఆ కల వచ్చినందుకు ఒక రకంగా మంచిగా అనిపించింది.

వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *