మహిళా మేలుకో

మహిళా మేలుకో

మహిళల ను చూసే ధోరణి మారాలి…. నాకు భార్య, కూతురు, తల్లీ ఉన్నారు. మన పూర్వీకులు మన మీద ఎన్నెన్నో బలవంతంగా రుద్దారు.

కాలానుగుణంగా ఎన్నో మార్పులు చూశాము. ఇంకా చాలా మారాల్సి ఉంది. మగాడికి ఎంత స్వేచ్ఛ ఉందో ఆడవాళ్లకి కూడా అంతే ఉండాలి ఇవ్వాలి.

మారాలి లోకం తీరు… ఆడవారిని అర్థం చేసుకుని ప్రోత్సహిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. సమానత్వం ఎక్కడా లేదు, ఇప్పట్లో రాదు.

అభివృద్ది చెందిన దేశాలలో కూడా ఆడవారిని చూసే కోణం లో మార్పు లేదు మగావరి ఆలోచనలలో మార్పు రావాలి. అమ్మాయి అంటే *క్స్ ఒకటే కాదు అని తెలుసుకోవాలి ఐతే *క్స్ లేకపోతే ఇంట్లో అన్నీ సమకూర్చే పని మనిషిలానే చూస్తారు.

ఈ జెనరేషన్ లో కొంచం (2%) మార్పు వచ్చింది అని అనుకుంటా. ఉమెన్స్ డే రోజు వాట్సప్ లో స్టేటస్ పెట్టుకోవడం మాత్రమే కాదు, ఆడ మగ అన్న తేడా ఎక్కడా కనిపించకూడదు.

నూటికి 95% మన పూర్వీకులు కారణం. మన దేశం కొంచం పర్లేదు.. ముస్లిం దేశాల్లో పరిస్థితులు  దారుణం *క్స్ ఎడ్యుకేషన్ అనేది అందరికి చాలా ఇంపార్టెంట్.

మనదేశంలో చిన్నతనం నుంచే *క్స్ ఎడ్యుకేషన్ అనేది పెట్టాలి. ఇలా చేయడం వల్ల మహిళలపై జరిగే అత్యాచారాలు తగ్గుముఖం పడతాయి అనే నమ్మకం నాకు ఉంది.

మహిళ లేకపోతే మనుగడ లేదు అనే నిజాన్ని అందరూ తెలుసుకోవాలి. ప్రతి మగాడి లోనూ కచ్చితంగా మార్పు రావాలి అది తన ఇంటికే పరిమితం కాకుండా ఏ రంగాలలో ఉన్న స్త్రీలను గౌరవించే విధంగా ఉండాలి.

ముస్లిం దేశాలలో ఆడవారిపై దాడులు జరిగితే ఎంత తీవ్రంగా ఉంటాయో అంతే తీవ్రంగా మన దేశంలో కూడా చట్టాలు ప్రభుత్వంలో మార్పులు రావాలి. ముఖ్యంగా మగవారిలో ఈ మార్పులు కచ్చితంగా రావాలి.

మహిళలు అన్నిట్లో ప్రోత్సహిస్తూ ఉండాలి అప్పుడే వాళ్ళు ఇంకా అద్భుతాలు చేయగలరు అని గుర్తించాలి. ఒక మగవాడిగా ఆడవారి పై నాకున్న అభిమానాన్ని నేను ఈ విధంగా చెప్పుకుంటున్నాను సోదరీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

 

– రఘురాం కడప

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *