మహిళా శక్తి

మహిళా శక్తి

మహిళా శక్తి

1. ఆ.వె.

 మహిళ చేతగాని పని లేదు వసుధలో
 నేర్పు.ఓర్పు గలిగి నెలత చేయు
 అలసటెరుగకుండు ఆలనా పాలనా
 కన్న సంతు సమము కరుణ జూపు

2. ఆ.వె.

 కష్ట కార్యములని కోమలుల కివ్వక
 స్త్రీలు సున్నితులని చీత్కరించ 
 అట్టి పనుల జేసి అబలలం గామని
 నిలిచి గెలిచి తెలిపె నేటి మహిళ

3. ఆ.వె.

 అంతరిక్ష మంత అవలీలగా తిరిగి
 రణము గెలిచి రమణి రాజ్యమేలె
 రాజకీయ మందు రాణించె లేమలు
 రాష్ట్రపతిగ ” ప్రతిభ “రాణకెక్కె

4. ఆ.వె.

 కదనరంగమందు.కడలి అంచుల యందు
 పారిశుధ్యమందు.పాడియందు
 సైన్యమందు.వైద్యసమయమందే కాక
 ఇంటి పనులు పెక్కు.వంట వనితె

5. ఆ.వె.
 ఆడజన్మ లేక అవని పూర్ణము గాదు
 సృష్టి కార్యమెల్ల శూన్యమగును
 ఏక చక్ర శకట మేరీతి సాగును
 రమణి తోడు వున్న రక్ష మనకు

– కోట

మగువ Previous post మగువ
రైతును జైల్లో పెట్టాలి Next post రైతును జైల్లో పెట్టాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *