మహిమోపేతుడు, జ్ఞాన రూపుడు!!

మహిమోపేతుడు, జ్ఞాన రూపుడు!!

” నా భర్త నోట్లో నాలిక లేని మనిషి. అలాంటి వాడిని నీ మొగుడు చావ చితకబాదాడు. ఇప్పుడు ఆయన ఆస్పత్రిలో చావో, బ్రతుకో తెలియని స్థితిలో మంచంపై కొట్టుమిట్టాడుతున్నాడు. అసలు నీ భర్త కి మనసెలా వచ్చింది., నా మొగుడిలాంటి మూగ జీవిని కొట్టడానికి? “
అని ఒక అమాయకపు స్త్రీ ఇంకో స్త్రీ నిలదీస్తోంది.

” ఇంకా కొట్టి విడిచిపెట్టాడు. నయం. అసలు, నరికి పోగులు పెట్టాల్సింది. అక్కడికి సంతోషించు. ఆయన ఇంకా అలా చేయలేదు. పో అమ్మ మా ఇంటి ముందు గొడవ పెట్టకు పో…! నా భర్త చాలా మంచోడు. ” అని ఓట్రించింది ఆ ఇంటి ఇల్లాలు.

అసలు విషయం ఏంటంటే………! ఈ అమాయకురాలి భర్త, ఆ గడుసు స్త్రీ భర్త కారు ముందు, షాపులో చిన్న పనే కదా అని బండి పెట్టి లోపలికి వెళ్ళాడు. ఈ చిన్న విషయం ఆ కారు యజమానికి కోపం తెప్పించింది. అంతే, ఆ అమాయకుడి బండిని కిందపడేసి వాడ్ని విచక్షణారహితంగా కొట్టాడు.

మనుషులం మరి

నిత్యం ఆధ్యాత్మికత గురించి చెప్తూ ఆధ్యాత్మికతనే నెమరువేస్తూ నీతులు చెప్పేవారు ఈ రోజుల్లో పాన్ డబ్బాల్లాగ, కిరాణా కొట్లలాగా ప్రతి రెండు అడుగుల కి కనిపిస్తారు. మరి వీరు చెప్పే నీతి సూత్రాలు ఒక్కటైన వీరు అవలంబిస్తారా ……….? అంటే, మనకి జవాబు, ‘ లేదు ‘ అనే వస్తుంది.

నాకు తెలిసిన ఒక ఆధ్యాత్మిక జీవి గురించి మీకు చెప్తాను. ఈ శాల్తీ చెప్పేవన్నీ నీతి సూత్రాలు. ఆచరణలో మాత్రం శూన్యం. ఈ జీవికి తన స్మరణ , తన మంత్ర జపం చేసే వాళ్ళు అంటే బహు ఇష్టం. వేరే వాళ్ళని పురుగుల కన్నా హీనంగా చూస్తుంది. ఎందుకో మరి…..? మరి, ఎటు పోయింది ఈ శాల్తీ ఆధ్యాత్మికత….? ఈ జీవి ది, నీతి పోయి నూతిలో పడిందా మరి……….?

మనుషులం మరి

కష్టపడి చమటోడ్చి ఏదో ముద్ధ గడుపుకునే కష్టజీవులు ఈ ప్రపంచంలో 80 శాతం పైనే. వీరి రక్తాన్ని సేవించి కోట్లు సంపాదించే జలగలు కేవలం 20 శాతం మే……..! కాకపోతే, మొదటి కోవకు చెందిన వారు, వారి డొక్క ఆడించు కుంటారు. రెండో కోవకు చెందిన వారు, వారి డబ్బు ఆడించు కుంటారు. ఈ నగ్న సత్యం, మరి పాలకుడికి తెలీదా………?
తెలుసు. కానీ, మరి, వాడు ఓట్లు ఆడించు కోవాలి.

మనుషులం మరి

ఎదుటివాడు గంగలో మునగని. నేను బావుంటే చాలు అనుకునే స్వభావం స్వార్థపరుడిది. వీడికి ‘ పాపం ‘ అనే పదానికి అర్ధం తెలియదు. అనుక్షణం, వెనుక గోతులు
తవ్వే పనిలో లీనమై ఉంటాడు. వీడిని చూసి అయ్యో పాపం అనాలి జనాలు. అంత గొప్పగా నటించగలడు. వీడు మాత్రం ఆ మాట చచ్చినా ఉచ్చరించడు. పక్కింటాయన కి యాక్సిడెంట్ అయ్యింది అంటే ఇప్పుడెందుకు లే ఆస్పత్రికి వెళ్లి చూడటం, ఆ బాధితుడి భార్య అప్పు అడుగు తుందేమో అని భయ పడి చచ్చే వారు ఎందరో…….!

మనుషులం మరి

అందరం మారుదాం అండి. శుభాకాంక్షలు!!

మనుషులం మరి.

– వాసు

Related Posts