మన మువ్వన్నెల జెండా

మన మువ్వన్నెల జెండా

మూడు రంగుల జెండా
మనం మురిసే మువ్వన్నెల జెండా !

కీర్తి పతాకాల కిరీటం
ప్రగతి సోపానాల పారవశ్యం
మన మువ్వన్నెల జెండా!

త్యాగధనుల చరిత్ర
దేశభక్తికి చిహ్నం
మన మువ్వన్నెల జెండా!

మహామహుల త్యాగఫలం
సాధించిన ధీరులకల
మన మువ్వన్నెల జెండా!

ధర్మం దాగిన అర్ధము
శాంతిని బోధించే స్ఫూర్తి
మన మువ్వన్నెల జెండా!

జాతీయతనునింపేసంబరం
ఐకమత్యపువెలుగుజిలుగు
మన మువ్వన్నెలజెండా!

ఔన్నత్యపు శిఖరాలు
విశ్వశాంతి సంకేతం
మన మువ్వన్నెల జెండా!

విభిన్నసంస్కృతుల మేళవింపు
భారతావని గొప్పతనం
మన మువ్వన్నెల జెండా!

సౌభాగ్యానికి ప్రతీక
సామరస్యానికి గుర్తు
మన మువ్వన్నెల జెండా!

భారతజాతి గౌరవం
వివరించే విధేయత
మన మువ్వన్నెల జెండా!

దేశభక్తి చైతన్యం
పవిత్ర భారత తేజం
మన మువ్వన్నెల జెండా!

అంబరంలో త్రివర్ణ పతాకం
మాతృభూమికి వందనం

జయహో- భారత్ మహాన్
జయహో- భారత్ మహాన్
జయ- జయహో !

– జి జయ

Related Posts