మన తెలుగు

మన తెలుగు

అచ్చమైన
స్వచ్చమైన
తేనెలొలుకు
మన తెలుగు
56 అక్షరాల
ఆకుపచ్చని
మధుర బాంధవ్యం
మన తెలుగు
అమ్మతనం
కమ్మతనం
కలగలిపిన
మహచెడ్డ గర్వం
మన తెలుగు
వెటకారం మమకారం
సంస్కారం సింగారం
పరిహాసం పెద్దరికం
ఏదైనా గొప్పగా లెస్స పలికే
గుండె ధైర్యం
మన తెలుగు…
దేశభాషలందు తెలుగు లెస్స…
#అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు ….
– గీత

Related Posts