మానసిక బలం

మానసిక బలం

ఒత్తిడి దేనికి?
పుట్టినది ఆదీ ఇదే
కలవరింత,వాంఛకు
వత్తాసు ఈ వత్తిడి

ఆశలు మోసులేసి
పరుగులెత్తు సమయాన
ఆలోచనలు కొరవడితే
మిగిలేది ఒత్తిడి.అమ్మతనంలో

కమ్మదనం వెతుక్కోగలిగితే
పసితనంలో లేలేత పసిడి
ఆలోచనలు నింప గలిగితే
జీవితం పరిపూర్ణం కావచ్చు

మరి పారిపోవడం దేనికి
పరిస్థితులు చూసి పారిపోతే
ఏమంటారు బుద్ధి మాంద్యం
అంటారు. చిన్నప్పటి

తప్పటడుగులు తప్పు కాదు
ఇప్పుడు తప్పటడుగులు తప్పు
మనం మన బుద్ధితో మన
స్వంత ఆలోచన బలంతో

పద్ధతిగా ఆలోచిస్తే ప్రతి
నిమిషం చేద్దాం, కడదాం
హరివిల్లు ,అందుకుందాం
అనే భావాలు వర్ధిల్లు.

– కె.కె.తాయారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *