మనసులో మాటలు

మనసులో మాటలు

ఈరోజు (ఐదు సంవత్సరాల క్రితం) ఏంటో అసలు గడవట్లే అనిపించింది. అలా సరదాగా కాసేపు బయట తిరిగి వచ్చేద్దాం అన్ని వెళ్ళాను. ఏంటో జనం అంతా చాలా హడావిడిగా ఉన్నారు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. బయట కన్న ఇంట్లోనే బాగుంది అనిపించింది.

అప్పుడే నన్ను ఒక ఆవిడ పిలిచింది ఆవిడ ఎవరో నాకు తెలీదు ఇంత ముందు కూడా నేను ఎప్పుడు చూడలేదు కానీ ఆవిడకి నేను బాగా తెలిసినట్టు పలకరించి, బాబు కొంచం నాకు ఓ గోలి సోడా తెచ్చి పెడతావా డబ్బులు ఇస్తా నడవలేకపోతునా అన్నారు. నేను సరే అన్ని వెళ్ళి తీసుకువచ్చాను ఆవిడ ముఖంలో ఓ చిన్న నవ్వు చూసాను.

అప్పుడు ఆవిడని అడిగాను, ఇంత పెద్ద వయసులో కూడా ఇంత ఎండలో ఎక్కడకి వెళ్తున్నారు అని. అప్పుడు అవిడ, ఏం లేదు బాబు నా కొడుకు కూతురు గొడవ పడ్డారు, ఆ గొడవలో వాళ్ళు అస్తితో పాటు నన్ను పంచుకున్నారు. ఆరు నెలలు అబ్బాయి దగ్గర ఉంటే మరో ఆరు నెలలు అమ్మాయి దగర ఉండాలి ఇప్పుడు ఆరు నెలలు అయిపోయాయి కాబట్టి నా కూతురు దగ్గరికి వెళ్తున్నాను అన్నారు.

అది ఏంటి అండి మీ అబ్బాయి మిమ్మల్ని అక్కడ దింపొచ్చు కదా అని అడిగాను అమాయకంగా…. అవిడ నవ్వుతూ, నా మనుసులో ఉన్న బరువులనే దించలేని వారు నన్ను ఏం దించుతారు అన్నారు… నాకు అవిడ ఏం చెప్పిందో అర్థం కాలేదు. ఆవిడని మరో ప్రశ్న అడిగే లోపే సరే బాబు నేను బయలుదేరుతాను అని వెళ్ళిపోయారు.

కానీ ఆవిడ సంచిలో నుంచి ఓ లేఖ బయట పడింది అది ఏంటి అందులో ఏం ఉంది అనే కుతూహలంతో ఆ లేఖ ని చదివాను అందులో అవిడ తన బాధలు తన కష్టాలు తన కోరికలు తన బిడ్డలు ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి అని రాసుకున్నారు ఈ లేఖ అవిడ చనిపోయే లోపు తన పిల్లలు చదవాలి అని రాసుకున్నారు…

ఎంతో అందమైన లోకం కానీ అంతుచిక్కని సమాజం.. ఆ లేఖ అవిడ కి ఇవ్వాలి అని చాలా వెతికాను కానీ ఆవిడ కనిపించలేదు అలా ఐదు సంవత్సరాలు గడిచాయి ఒక రోజు అవిడ కనిపించారు కానీ శావం లాగా.. సరేలే అని ఆవిడ పిల్లలకి ఇస్తే ఈ చిత్తు కాగితం మాకు ఎందుకు అని చింపేసారు…

– వంశీ

Related Posts