"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

మంచి మాటలు కావాలని…!!!

మంచి మాటలు కావాలని…!!!

పల్లవి :—–

కలిగనే…
నాలోని భావనలకు నీకై
వేయి వసంతాలు నిండు వెలుగుల
పున్నమిగా పూయాలని…
ఓ అందమా…నా సొంతమా…

చరణం :—–

కలగన్న మదిలో కలలు
నిజాలై నడిచిన నీ అడుగులు
కనుపాపలపై చిత్రాలై…తెలియని
మోహం మఖ పరిచయమవుతు…
కుదిరిన చెలిమిగా తలచిన తలపులను
గుచ్చుతున్నవి…

చరణం :——

నిన్ను చూసిన అద్దం మౌనమై
సౌందర్యమా అది తొలచిన శిల్పమాని…
చెప్పలేని వేదనతో మూగబోయెను
విప్పలేని ఆలాపనలు అంతర్ముఖ
యాతనగా కోయబడిన గుండె గాయాన్ని
నీతీపి గుర్తులని కదుట పడుతున్నా…

చరణం :—-

నీ మోమున పిలుపులు
గాంధర్వమై రెక్కలు విప్పుతున్నవని
నా ఎద కోయిలలు ఆరారు కాలాలకు
ఋతువులా గానమై కోరుతు…
పూసగుచ్చిన ప్రతి అణువణువున
సంకేతాలు మన ప్రేమను నిలిపిన
బాసలతో మంచి మాటలు కావాలని…

– దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *