మంచితనము 

మంచితనము 

మంచితనము కంటే మించిన
సంపద లేదు అంటారు పెద్దలు 
అమ్మే ఆస్తి కాదు
కొనే వస్తువు కాదు
నిష్కల్మషమైన మనసులొ 
నుండి వస్తుంది 
మంచితనము అర్దం 
మారిపోయింది ఈ రోజుల్లో
మసకబారిన మంచితనము
తడబడుతున్న మానవత్వం
పరిహాసాల పందేరంలో
అబద్ధపు అంచుల్లో
సమాజపు సరిహద్దులో 
మంచితనాన్ని పరికిస్తే
మానవత్వం కనులు 
తెరుస్తుంది
మనలో వుండే భావమే
మంచితనంగా రూపుమారి 
మనకు చూపిస్తుంది
తీరు— తెన్నూ…
– జి.జయ

Related Posts