మంచు దుప్పటి

మంచు దుప్పటి

ఋతువులు మారితేనే
ప్రకృతి అందం మారుతుంది

మారిన అందాలు అందులోనూ
కప్పుకున్న మంచు దుప్పటి

భానుడి రాకకు వేచి చూడగా
మరికొంతసేపు సరికొత్త అందాలు చవిచూడమన్నది

హిమాలయాల అందచందాలు
వర్ణించలేని కాశ్మీర్ సరికొత్త
సోయగాలు

వైవిధ్యభరిత రంగుల వనాలు
రుచిచూసే అనుభూతుల క్షణాలు
పర్వత శిఖరాల పలు వరుసలు
ఉద్యన వనాల ఊసులు

ఆశ్చర్యకరమైన దారులు
ఆహ్లాదకరమైన
తెల్లని మంచు పొరలు

మనసు పరవశమయ్యేను
చూడగా దూదిపింజలదూరాలు

చలిమంటల కుంపటిలతో
వేడి వేడి టీ ల ఆస్వాదనతో
అందరి మనసుకొల్లగొడుతుంది
వణికే చలిలోనైనా కదా
ప్రకృతి మనకిచ్చిన వరం మరి…?

– జి జయ

Related Posts