మంచు దుప్పటి

మంచు దుప్పటి

ప్రచండమైన కిరణశరాలతో….
మంచు దుప్పటి మరుగున…
మత్తుగా మునగదీసుకున్న…
మర్త్యలోకాన్ని…
మేల్కొలిపిన ఆదిత్యుడు…
క్రమక్రమంగా…
పగలుకు వీడ్కోలు పలికి..
సంజె సోయగాల..
అరుణిమ లోంచి…
నిశ్శబ్ద నీరవంలోకి మారుతూ…
సవ్వడి లేకుండా సన్నగిల్లిపోతున్న.. ఉన్న ప్రతి సాయంకాలం…
ఆశ నిరాశల నిరంతర వలయంలో..
నలిగి విసిగివేసారిన నా మది…
ఆత్మవలోకనం చేసుకుంటుంది.
మంచు దుప్పటిని…
ఛేదించుకొని వచ్చే..
రేపటి మనోజ్ఞమైన…
తుహిన కిరణాల కాంతులను..
మళ్లీ చూడగలనో లేనో అని…

– మామిడాల శైలజ

Related Posts