మంచు

మంచు

ఎదుటి మనిషి కానరాకుండా
కప్పుకొనేరా మంచుదుప్పట్లు…
అనంత ఎడారిలో కూడా
దట్టమైన పొరల్లా మంచుదుప్పట్లు..
ముసలి ముతక కప్పుకునేరా
ఖరీదైన నూలు దుప్పట్లు…
పొడుచుకొచ్చేనురా సూర్యకిరణాలు
కరిగేనుర దట్టమైన మంచుదుప్పట్లు…
భానుడి వేడికి సొమ్మసిల్లినా
హిమము కరిగి కప్పెనుర దుప్పట్లు…
భోగిమంటలై వెలిగేనుర నిప్పురవ్వలు
మరింతగా కాచుకోగా చలిమంటలు..
హాయినిచ్చేనురా పొగలు కక్కే కాఫీలు
మంచుదుప్పట్లను చీల్చే ప్రయానికులకు..

– హనుమంత

Related Posts