మండే సూర్యుడు

మండే సూర్యుడు

పోరాట ఉద్యమాల్లో భాగమై…..
పీడిత తాడిత ప్రజల ధిక్కార స్సరమై…..
కార్మికులకు దారి వారధై…
తన కవిత్వంతో
బడుగు బలహీన వర్గాల్లో చైతన్యాన్ని నింపి….
ప్రశ్నించే తత్త్వాన్ని మేలుకకొలిపి….
బలవంతుల, ధనవంతుల
దౌర్జన్యాలు, మోసాలు
ఇక సాగవంటూ….
తన అక్షరాయుధాలు ధరించి….
ఉత్తుంగ తరంగంలా…
ఉప్పెనలా తిరగబడి…
మండే సూర్యుడిలా….
ప్రజల గుండెల్లో
పొద్దు పొడిచిన
అభ్యుదయ సూరీడు
పద పద మంటూ…
రేపటి వెలుగుకై పోరాడమంటూ….
ఘోసిల్లిన విప్లవ శంఖమితడు
అణగారిన సమాజాన్ని మేల్కొలిపిన…..
విస్ఫోటనమితడు
సామ్రాజ్యవాద శక్తులను
ప్రజల తరపున ప్రశ్నించిన
గొంతుకితడు
కన్నీరు కాల్చడం కాదు…
పిడికిలి బిగిస్తేనే, చెమట చిందంస్తేనే……
చరిత్ర తిరగరాయగలమని
ఎలుగెత్తి చాటిన….
యోధుడితడు
సామాన్యుల
కష్టానికి చెమట చుక్కగా…..
ఆకలికి అన్నంగా….
ఎండకు వానకు గొడుగుగా….
పోరాటానికి ఆయుధంగా…..
గుండె చప్పుడుగా మారాడు
విప్లవ కవి… మహాకవి..
శ్రీ శ్రీ

( శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా)

– రహీం పాషా

Related Posts