మండుతున్న అగ్నిగోళము
మండుతున్న అగ్నిగోళము నుండి
జారిపడుతున్న గ్రహశకలాల వలె
రగులుతున్న నీ గుండెమంటల
నుండి రాలుతున్న అగ్నికణముల వలె
నీ కలం నుండి జాలువారి
రాల్చిన కవితాక్షరములు
కన్నీటి పర్యంత యతలను
తెలిపే ఆవేశాగ్ని కణాల వలే
భగభగ మండిపోతుంటాయి
కుల మతాల తోపులాటలో
ఎదుగుతున్న నీ యవ్వనం
చిత్కార సత్కారంతో
రగిలిన నీ ఆవేశం
రాసినావు ఒక గబ్బిలం
ఎదురులేని గబ్బిలమా
నీకు అడ్డు ఎవరు చెప్పరుగా
నీకున్నా ఆ స్వేచ్ఛా నాకెందుకు లేదుగా
అంటరాని వాని ఆవేదన తెలుపగ
మోసపూరిత మాటలతో
మోసపోయిన ఫిరదౌసి
మహాకావ్యం రాసినా
మన్నించలేదుగా
అని తెలిపినావుగా
ప్రకృతి ప్రజ్ఞాని
గిజిగాడు పక్షి అని
అందమైన గూడు
ఎవడు చేయలేడు
అబ్బురపరిచే కళాత్మకం
అలరించే నీ కవితాత్మకం
అడుగడుగునా అడ్డు తగిలె
ఆచారపు అడ్డుగోడలు ఎవరి
నిర్మాణం అని ప్రశ్నించే చైతన్యన్నీ
నింపిన మహాకవి విశ్వకవి
కవి కళాప్రపూర్ణ
– బొమ్మెన రాజ్ కుమార్