మనిషి-మార్పు

మనిషి-మార్పు

మార్పు అనగా కాలచక్రంలో ఒక అంతర్భాగం మార్పు మనిషి జీవితంలో ప్రతిక్షణం అనుభవించే సహజమైన ప్రక్రియ. అదెలా అంటే నిత్యనూతనంగా వుంటుంది.
మార్పు సహజంగానే ఉద్భవిస్తుంది అసహజంగా కూడా వస్తుంది ఇంకా విజ్ఞానం, వినోదం, జీవన విధానం ఇవన్నీ వర్తమానం నుండి భవిష్యత్ కి వారధి గా అనుకోవచ్చు.
మార్పు వచ్చిన ప్రతి అంశం మనిషి అందిపుచ్చుకుని ముందుకు సాగిపోవాలి. సహజమైన మార్పు కాలం అధీనంలో వుంటుంది.
కొన్ని పరిణామాల కారణంగా వచ్చేది అసహజమైనరీతిలో వుంటుంది. అది మలుపులను ఇస్తుంది. మార్పు అనే విషయం మనము స్వీకరించే దృష్టి పై ఆధారపడివుంటుంది.
మార్పు సానుకూలంగా తీసుకుంటే జీవిత గమనముగా తీరుస్తుంది. అనుభూతి చెందుతూ వుంటే ప్రతిదీ అమోఘం అయి తీరుతుంది.
– జి.జయ

Related Posts