మనిషిని పోలిన మనుషులు

మనిషిని పోలిన మనుషులు

మనిషిని పోలిన మనుషులు

ఇది నిజంగా జరిగిన సంఘటన. కాకపోతే నాక్కాదు, మా ఇంట్లో వారికి,  అప్పట్లో మేము పాత ఇంట్లో ఉండేవాళ్ళం. అందరం ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నాం. అయితే సుచిత్ర లో మా చిన్న పిన్నివాళ్ళు ఉండేవాళ్ళు. రాకపోకలు ఉండేవి అప్పట్లో .ఇప్పుడు ఎవరు రావడం లేదు. అది వేరే విషయం లెండి.

అలా ఉన్నప్పుడు ఎప్పుడూ ఇష్టం ఉంటే అప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు. కానీ మేమే వెళ్ళేవాళ్ళం కాదు ఎందుకంటే వాళ్ళ ఇల్లు చిన్నగా ఉండేది.

కాబట్టి వాళ్లే ఇక్కడికి వచ్చి రోజులకు రోజులు ఉండేవారు. మా పిన్ని కొడుకు కాలేజీకి వెళ్ళబుద్ది కానప్పుడు మా ఇంటికి వచ్చి తిని బాగా పడుకునేవాడు.

అమ్మకు చెప్పకండి అని బతిలాడే వాడు. అలాంటిది ఒక ఆదివారం రోజు మేము అందరం ఇంట్లోనే ఉన్నాము. అప్పుడే తినడానికి కూర్చున్నాం. రోజు అందరం ఉండము కాబట్టి, ప్రతి ఆదివారం అలా అంతా కూర్చుని తినడం అలవాటు. సరిగ్గా అప్పుడే మా చిన్న తమ్ముడు ఫోన్ రింగ్ అయ్యింది.

అన్నా ఎక్కడ ఉన్నావు అంటూ ఫోన్ చేశాడు వంశీ, నేను ఇంట్లోనే ఉన్నాను అన్నాడు మా తమ్ముడు. అన్నా వెంటనే సికింద్రాబాద్ కి రా అన్నాడు.

ఎందుకు రా అన్నాడు తమ్ముడు.అరే నువ్వు రా అన్నా తొందరగా అంటూ ఫోన్ పెట్టేసాడు. సరే అని అప్పుడు బండి ఉండడం వల్ల బండి పైన తినకుండా నే వెళ్ళాడు.

అక్కడికి వెళ్ళాక ఎందుకు రమ్మన్నాడు అని అనుకున్నాం మేము . మేము తినేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నాం. గంట తర్వాత తమ్ముడు వచ్చాడు.

ఏంది రా ఏమైంది అని అడిగాము. అప్పుడు వాడి ఒక్కడి దగ్గరే ఫోటో లు వచ్చే ఫోన్ ఉండేది. అందర్నీ పిలిచి ఫోన్ లో ఫోటో చూపించాడు మాకు .

నీ అవ్వ మేము ఏదో అనుకున్నాం నీ ఫోటో నువ్వే చూపించుకుంటా జోక్ చేస్తున్నావా అన్నాము మేము.

ఏ కాదమ్మా, సక్కగా చూడండి ,మంచిగా గమనించి ఉండాలి చూడండి అన్నాడు. ఏముంది రా నీ ఫోటో నే కదా దాన్నే మల్ల మల్ల చూడమంటావు అంటూ తిట్టాము.

మీ మొఖం అది నేను కాదు .నాలాగే ఇంకొకడు. వంశీ గాడు నన్ను పిలిచింది అందుకే నాలాగే ఇంకొకడు అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కూర్చుని ఉన్నాడు. దగ్గరికి పోయి చూసేదాకా నేనే అనుకున్నాడట, అంటూ అరె నువ్వు చెప్పురా అన్నాడు.

దానికి వంశీ కూడా అవును పెద్దమ్మ ,నిజంగా అన్ననే అనుకున్న నేను పోయి మాట్లాడిన కూడా అన్న ఎక్కడున్నావేంది అని, కానీ అతను హిందీ వాడు కావడం వల్ల నా తెలుగు వానికి అర్థం కానట్టు ఉంది .

వాడేం సప్పుడు చేయలేదు. నాకు డౌట్ వచ్చి అన్నకు ఫోన్ చేసినా, అన్న అయితే  నన్ను చూడంగానే పలకరిస్తుండే కదా ,అందుకే ఫోన్ చేసి రప్పించిన అన్న కూడా షాక్ అయ్యేండు తెలుసా, అనడంతో మేము మళ్ళీ ఆ ఫోటోను పరీక్షగా చూసాము .

నిజమే అచ్చం చిన్న తమ్ముడు లాగే ఉన్నాడు. కానీ కాస్త మీసం కట్టు అది చిన్నగా ఉంది అంతే తేడా .మిగిలిందంతా సేమ్ టు సేమ్ ఉన్నాడు. అది చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. నిజమే మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట అని ఆ సంఘటనతో మాకు రుజువయింది.

ఇప్పటికీ అంతే మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు మాట్లాడితే ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాదు. చిన్నోడు మాట్లాడితే పెద్దోడు లాగా ,పెద్దోడు మాట్లాడితే చిన్నోడు లాగా వినిపిస్తుంది. అందుకే ముందుగా మేము పెద్దవాడివా,  చిన్నోనివా అని అడుగుతాము. అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ కాన్ఫరెన్స్ పెట్టి మమ్మల్ని ఆట పట్టిస్తూ ఉంటారు.

ఇక నా గురించి అంటారా  ? మనలాంటివారు ఇంకొకరు ఉండరు అనుకుంటున్నా నేను, కాకపోతే నన్ను కొందరు హీరోయిన్ నిరోషా లాగా ఉంటావు అని అన్నారు. (అప్పుడు మనం కాలేజీలో జుట్టు కట్ చేసుకున్నాం లెండి ).

ఇప్పటికి కూడా మా అమ్మ నువ్వు  నిరోషా  లాగా ఉంటావు అని అంటుంది. విచిత్రo ఏమిటంటే అలా అనక ముందు నుంచి నాకు ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.

ఇదండీ మనిషిగా పోలిన మనుషులు నిజమైన కథ

-భవ్య చారు

 

ఆడవారి ఆరోగ్యం Previous post ఆడవారి ఆరోగ్యం
ఇష్టమైన కవులు Next post ఇష్టమైన కవులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *