మన్నింపు

మన్నింపు

భావం బావుంటే భవిష్యత్తు బావుంటుంది
మన్నించే గుణముంటే
మంచే జరుగుతుంది అంటారు.
మన్నించే మనసుసున్నవాడు
దేవుడి కన్నా గొప్ప వాడట
మనసు నొచ్చిన మాటను
మన్నింపూ కడుతుంది
జారిపోయిన కాలాన్ని కటినంగా శిక్షించకు
మనసుకు నచ్చినది ఒప్పు
ఎదురువచ్చింది తప్పు కాదు అని తెలుసుకో
దయ జాలి కరుణ నవ్వు
దేవుడిచ్చిన వరాలు.
అహంకారము నీవు నేర్చిన
అభ్యాసము అందుకే
ఒక్కసారి మన్నించి చూడు
నీకే తెలుస్తుంది ఆ శాంతత.
అది ఒక కనువిప్పుగా మిగులుతుంది
నిన్ను నమ్మిన  వారిలో.
– జి.జయ

Related Posts