మనుషులు

మనుషులు

ఆ.వె

1) పంచభూతములను పట్టి ఆడించుచూ
    మనిషికున్న గొప్ప మహిమ చాటె
    జీవరాశి యందు చిన్న దేహము వాడు
    మేథయందు జగతి మేలుకొలుపు

ఆ.వె.

2) మనిషి తిరుగుతు గనె మహిలోన వింతలు
     మనిషి మేథ తోటి మహిమ జేసి
     అవని వింతలు మార్చి ఆనందపడుచుండె
     ముప్పు ఎరుగడాయె ముందు ముందు

ఆ.వె.

3) నాటి మనుషులంత సాటి మనిషి తోటి
    ఐకమత్యముండి ఆదరించె
    నేటి మనుషులంత సాటి వాన్నేదోచి
     ఏమి ఎరగనట్లు ఏడ్చుచుండె

ఆ.వె.

4) ముందు మాట వినపసందుగా ఉండును
     వెనుక గోతి తీసి వెన్ను పొడుచు
     బంధువులనువారు బద్ధశత్రువులాయె
     ఎవరు మంచివారొ ఎరుగ లేము

– కోట

Related Posts