మరణాన్ని ఆపగలమా

 

 

ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ మైఖేల్ జాక్సన్ 150 సంవత్సరాలు జీవించాలనుకొన్నాడు…(సాధ్యమయ్యిందా ?) కానీ…

ఆయన్ను అంటిపెట్టుకొని ప్రతిరోజు ఆయనను నఖ శిఖ పర్యంతం పరీక్షలు నిర్వహించి, ఆయన ఆరోగ్యం కాపాడడానికి తన ఇంటివద్ద 12 మంది వైద్యులను నియమించుకొన్నాడు.

మరో 15 మంది ట్రైనర్లు ఆయన దేహదారుఢ్యాన్ని కాపాడేందుకు నియమించబడ్డారు.

తాను తినే ఆహారం ముందుగా లాబరేటరీ లో పరీక్షించబడి, అప్పుడు మాత్రమే ఆయనకు వడ్డించబడేది.

ఆయన పదుకొనె మంచం ఆయన పీల్చుకొనే ప్రాణవాయు పరిమాణాన్ని నియంత్రించగలిగే సాంకేతికతను కలిగి ఉండేది.

ఆయనకు ఏ అవయవం ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో ఇచ్చేందుకు అవయవ దాతలు సర్వదా సిద్ధంగా ఉండేవారు. ఈ అవయవ దాతలందరి యోగక్షేమాలు ఈయన సొంత ఖర్చుపై చూసుకోబడేవి.

ఈ వసతులన్నింటితో ఆయన 150 సంవత్సరాలు జీవించాలన్న కలతో/ కోరికతో జీవనం సాగించారు.

అయ్యో, ఆయన విఫలమయ్యాడే!

50 సంవత్సరాల వయస్సులో, 2009 సం, జూన్ 25 వ తేదీన ఆయన గుండె పని చేయటం మానేసింది.

ఆయన ప్రాణాన్ని నిలబెట్టడానికి ఆ 12 మంది డాక్టర్ల నిరాఘాట, నిర్విరామ ప్రయత్నాలు ఫలించలేదు.

లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా నుండి రప్పించబడిన ప్రత్యేక నిపుణులైన డాక్టర్ల ప్రయత్నాలు కూడా ఆయనను రక్షించలేకపోయాయి.

25 సంవత్సరాల పాటు ఆయన వ్యక్తిగత డాక్టర్ల సలహా తీసుకోకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయని వ్యక్తి 150 సంవత్సరాలు జీవించాలన్న ఆయన స్వప్నాన్ని సాకారం చేసుకోలేకపోయాడు.

2.5 మిలియన్ మంది ప్రత్యక్షంగా తన అంతిమ యాత్రలో పాల్గొన్న చరిత్ర ఇప్పటిదాకా ప్రపంచంలో ఒక్క జాక్సన్ మాత్రమే దక్కించుకోగలిగాడు.

ఆయన చనిపోయిన ఆ ప్రత్యేక దినమైన 25/06/2009 వ తేదీన 3.15 నిముషాలకు వికీపీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లు పనిచేయటం మానేసాయి. మిలియన్ల కొద్దీ జనం మైఖెల్ జాక్సన్ గూర్చి గూగుల్ లో వెతికారు…

జాక్సన్ చావును సవాలు చేసి, దాన్ని జయించాలనుకొన్నాడు; గానీ, చావే జాక్సన్ కు ప్రతిసవాలు విసిరి, తానే జయించింది.

ఈ భౌతిక ప్రపంచంలో మన భౌతిక జీవనాన్ని, భౌతిక మరణం కబళిస్తుంది. ఇది జీవన నియమావళి.

ఇప్పుడు మనమోసారి ఆలోచిద్దాం!

మనం డాక్టర్లు, ఇంజినీర్లు, డెకోరేటర్లు, డిజైనర్ల కోసమే (డబ్బు) సంపాదిస్తున్నామా?

అత్యంత విలాసవంతమైన భవంతులు, కార్ల తోను; అత్యంత వ్యయభరితమైన వివాహ వేడుకలతోనూ మనం ఎవరిని సంతృప్తి పరచాలనుకొంటున్నాం?

రెండే రెండురోజుల క్రితం ఓ వివాహ వేడుకలో మనం తిన్న ఆహారపదార్ధాలను నేడు గుర్తుకు తెచ్చుకోగలమా?

మన జీవనాన్ని మనమొక మృగంలా ఎందుకు కొనసాగిస్తున్నాం?

సుఖ జీవనానికని చెప్పి, ఎన్ని తరాలకు సరిపడా సొమ్మును మనం ఆదా చేయలనుకొంటున్నాం?

మనలో అత్యధికులకు ఒకరు లేదా ఇద్దరు సంతానం మాత్రమే ఉన్నారు. అయితే, మనమెప్పుడైనా, మనకెంత అవసరం ఉంది, మనం ఎంత కోరుకొంటున్నాం అని ఒక్క క్షణమైనా అలోచించామా?

‘మా పిల్లలు సంపాదించ లేని అసమర్థులు కాబట్టి వారి కోసం మరింత పోగు పెట్టటం అవసరమని’ మనం ఒప్పుకొంటున్నామా?

ఈ వారంలో నీకోసం గానీ, నీ కుటుంబం కోసం గానీ, నీ మిత్రుల కోసం గానీ, కొంత సమయమైనా కేటాయించగలిగావా?

నీ కోసం నువ్వు కేవలం ఐదు శాతం సొమ్మునైనా ఖర్చు చేసుకోగల్గుతున్నావా?

మన జీవన మనుగడలో మనమేం సంపాదిస్తున్నామో వాటిలోనే మనం ఆనందాన్ని ఎందుకు వెతుక్కోలేకపోతున్నాము?

వీటి కోసం నువ్వు లోతుగా ఆలోచిస్తే నిద్రలేమి, స్థూలకాయం, వెన్నుపూస జారిపోవటం వంటి వ్యాధులు నిన్ను చుట్టుముడతాయేమో?! బహుశా నీ గుండె కూడా పని చేయటం మానేస్తుందేమో?!

ముగింపు:

నీకోసం నువ్వు కొంత సమయాన్ని వెచ్చించుకో. మనం ఏ విధమైన ఆస్తుల్ని సొంతం చేసుకోలేం, అవన్నీ కేవలం తాత్కాలికంగా మన పేరు రాయబడే దస్త్రాలు మాత్రమే!

‘ఇవ్వన్నీ నా ఆస్తులు’ అని నీవు చెప్పినప్పుడెల్లా, భగవంతుడు నిన్ను చూసి ఓ వికృత నవ్వు నవ్వుతూ ఉంటాడు.
ఓ వ్యక్తి నడుపుతున్న కారును చూసి, వేసుకున్న బట్టలు చూసి, అతనిపై ఓ గొప్ప భావనను నువ్వు సృష్టించుకోనవసరం లేదు.

మనకున్న గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు, గణిత మేధావులు, సంస్కర్తలు లాంటి మహానుభావులంతా వారి ప్రయాణానికి వారు స్కూటర్ లను సైకిళ్ళను మాత్రమే వాడేవారు!

ఐశ్వర్యవంతుడవ్వాలనుకోవటం పాపం కాదు; కేవలం డబ్బుతో మాత్రమే ఐశ్వర్యవంతుడవ్వాలనుకోవటం కచ్చితంగా పాపం!

జీవనాన్ని నువ్వు అదుపులో పెట్టుకో, లేకుంటే, అది నిన్ను తన అదుపులోకి తీసుకొంటుంది.

చివరకు-
మన జీవన చరమాంకానికి మనం పొందే ‘ఆనందం’, ‘తృప్తి’, ‘శాంతి’ మాత్రమే మనకు నిజమైన వాస్తవ విషయాలుగా ఋజువవుతాయి.

విచారించదగిన విషయమేమంటే- వీటినేమీ మనం డబ్బుతో కొనుక్కోలేము…🙏🙏🙏

సేకరణ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *