"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

మరుగైన జీవనాధారం 

మరుగైన జీవనాధారం 

ఎంతో అందమైన, మెరుగైన, చక్కని కళాకృతులతో ఉండే మేదర అల్లకాలు ..

వెనుకటి రోజుల్లో చేతివృత్తులుగా జీవనోపాధికి ఉపయోగపడిన మేదర బుట్టల అల్లకాలు ఇవి ..

మన చిన్నప్పుడు ప్రతి ఇట్లో బుట్టల గాను చాటల గాను, చాపల గాను ఇంకా అందమైన కళాకృతులు గాను కనపడుతూ ఉండేవి.

అప్పుడు వాటికి చాలా ప్రాముఖ్యత ఉండేది కానీ రాను రాను మన ఇళ్ళల్లో ప్లాస్టిక్ ,స్టీలు ,పింగాణి ఇలాంటి వస్తువులు ఎక్కువ కావడంతో మేదర వస్తువుల వాడకం తగ్గింది.

మేదర అల్లకం వాళ్ళదరికీ జీవనోపాధి క్షీణించి పోయిందనే చెప్పుకోవాలి వాళ్ళ జీవనాధారం చాలా బాధాకరం ఇప్పుడు.

ఈ వయసులో కూడా ఆ అమ్మ ఏ ఒక్కళ్ళైనా వచ్చి కొనక పోతారా అంటూ!

కూర్చోని చూసిచూసి అలసటతో కునికి పాట్లు పడుతు ఉందటే ఎంత దీనస్థితిలో ఉందో చూస్తుంటే చాల జాలి కలుగుతుంది.

ఆ మేదర వాళ్ల పరిస్థితి ఎంత దయనీయకరంగా ఉందో కదా !

అర్థం చేసుకోని వాళ్ళదగ్గర ఒక వస్తువు కొని తెచ్చుకుంటుంటే అది మనకి వాళ్ళకు కూడ ఆనందమే ..

ఏపని చేయకుండా అడుకునే వాళ్ళకు ధర్మం పేరిట డబ్బులు వేయకండి ..

అంగవైకల్యం , వయస్సు చూడకుండా ఇలా కష్టపడే వాళ్ళకు సాయంగా ఉందాం..

మన ఊరి చేతి వృత్తిని కాపాడు కుందాం..

– ఆలపాటి సత్యవతి 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *