మాట్లాడు 

మాట్లాడు 

మాట్లాడు

ఏమైనా మాట్లాడు
ఎప్పటిలాగే ఈరాత్రినీ ముగిసిపోనివ్వకు
వీలైతే కాస్త వెన్నెలలో తడిపి
నా మునివేళ్ళని వెలిగించిపో

*

ప్రియా…
నిజంగా మాట్లాడనా..లేక
పెదాలనో, ఆకులనో కదిలించి పోనా

ఎప్పుడైనా
ఈ మ్రానుపై నుండి నా దేహాన్ని దించి
గాయాలను ముద్దాడావా
కనీసం లేపనమయ్యావా

ఎప్పటిలాగే
నన్ను మాట్లాడనివ్వని నీ మాటల్లో
ఈ మూగ మనసును జోకొట్టనా

నిజానికి..
నేను యుగాల తరబడి
మాట్లాడుతున్న సెలయేరుని
నీవే మనసు మూసుకున్న ఎడారివి

*

అవును
చేతులు చాచిన నీ ప్రేమ నాకు లోకువయ్యింది
వెలేసిన లోకం ప్రియమయ్యింది

ఒక్కసారి
ప్రేమగా నన్ను చీల్చిపో
రక్తపుముద్దలాంటి
తెల్లని పసి ఏడుపుతో బయటకొస్తాను

-గురువర్థన్ రెడ్డి

ఆత్మ సాక్షిగా Previous post ఆత్మ సాక్షిగా
ఊరటనిస్తాడు Next post ఊరటనిస్తాడు

One thought on “మాట్లాడు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close