మట్టి వాసన

మట్టి వాసన

మట్టి వాసన గుప్పుమంది
మది పులకించి పోయింది
అణువణువునా !

మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది
మనకిచ్చిన ప్రకృతి

మాతృభూమి మట్టి వాసన
మరపురాని పరిమళం

మట్టితోనే మమేకమైన జీవనం అత్తరు చల్లిన ఆనందం

మేఘాల గుంపుతో
వర్షించేతొలకరిజల్లు

కురిపించకుండానే హృదయంఉప్పొంగుతుంది

భూమిపుత్రులకు సుగంధ
సిరులు అదిఒకమరుపురాని
మధుర జ్ఞాపకం

పల్లెసొరగులోనిఆస్వాదనపు పరిమళం

అన్నదాయిని అమృతపు
మాధుర్యం అదే మనదేశపు
మట్టిలోనే దాగిన కమ్మదనం మరి……?

– జి జయ

Related Posts