మట్టి వాసన

మట్టి వాసన

మట్టి విలువ తెలిసిన
మనిషికి మనిషి విలువ
గొప్పగా తెలుస్తుంది అని
పెద్దల మాట!

మట్టి వాసన మనల్ని మంత్ర
ముగ్ధుల్ని చేస్తుంది!

సాటిలేని పరిమళం
ప్రకృతి మనకిచ్చిన వరం!

అన్నదాయిని అమృత ప్రదాయిని పంచభూత మయo !

మరపురాని మాధుర్యం
అన్నదాతకు అత్తరు చల్లిన
ఆనందం!

తొలకరిజల్లుల కమ్మదనపుo
తెలియని అనుభూతుల సిరులు!

వర్షించే మేఘానికి పరిచిన
ఆహ్లాదమయ మట్టితివాచీ!

ఉప్పింగిన ఉత్సాహానికి
మట్టి వాసన గుప్పుమన్న
వర్ణన లేని సుగంధం!

పల్లె సొరగులో పరిమళ
భరితం ఆ మట్టి అంతరంగం !

మట్టి వాసనలో మమేకమై
జీవనంగడిపేఅదృష్టవంతుడే వ్యవసాయ దారుడే
కదా మరి …..?

– జి జయ

Related Posts