మాయ

మాయ

జగమంతా మాయ జనులెల్లా మాయ
జరుగుతూ వున్నది మాయ 
జరగబోయేది మాయ అంటారు
కళ్ళు మాయ చేస్తే మోసపోతారు
మనసు మాయ చేస్తే
దారి దొరకడం కష్టం
ఆశలు ఎక్కువైతే నమ్మకం
మాయ అవుతుంది
మాటలు మాయచేస్తే
చేదు నిజాలవుతాయి
డబ్బు మాయలో పడితే
లోభి అవుతారు
బుద్ధిని మాయ చేస్తే యుక్తి
చేజారుతుంది
ప్రేమలో పడితే పేరు
పెట్టలేని మాయ
భక్తి ఎక్కువైతే భగవంతుడి
మాయలో పడతారు
మాయాజాలపు కాలాన్ని మాయచేసి  కనుమరుగు
కాకుండా నిన్ను నీవు మాయలో పడితే శూన్యం
అందుకే
ప్రతీ రోజు నేదైన రీతిలో జీవించు 
ప్రతిక్షణం  నీ కోసమే వున్నది. 
– జి.జయ

Related Posts