మాయలేడి

మాయలేడి

రజినీ హాస్పిటల్ లో నర్స్ గా  పని చేస్తుంది. తనకి ఒక కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి”నేను ఇప్పుడే వస్తున్నా” అని చెప్పి హడావిడిగా హాస్పిటల్ కి బయలుదేరింది.
రజినీ జల్సాలకు బాగా అలవాటు పడింది. జీతం తనకి అసలు సరిపోయేది కాదు.  మంచి ఆస్తి ఉన్న వాడిని కోసం వెతుకుతూ అందరి దగ్గర మాత్రం మంచి అనే ముసుగు వేసుకొని నటిస్తుంది.

డాక్టర్ కూడా తనని నమ్మి  ఎన్నో విషయాలను చెప్పుకున్నాడు.  అలా నమ్మిన వారి దగ్గర కూడా అబద్ధాలు చెప్పి అప్పులు చేసింది.”చూడు… రజినీ నువ్వు ఆమె జాగ్రత్తగా చూసుకో
రేపు ఉదయం వాళ్ళ అబ్బాయి వచ్చాడు” అని చెప్పాడు డాక్టర్.

“అలాగే డాక్టర్ గారు” అని ఆమె దగ్గర కూర్చొని ఉంది రజినీ.”రజినీ ఒకసారి నాతో రా. నీతో ఒక విషయం చెప్పాలి” అని చెప్పి బయటకి తీసుకొని వెళ్ళింది శివాని.”అబ్బా… ఏంటే చెప్పు” అని అడిగింది రజినీ.

నువ్వు ఆ పేషెంట్ ని చూసుకుంటున్నావ్ కదా. వాళ్లు డబ్బు , ఆస్తులు ఉన్నోళ్లు అంట , డాక్టర్ ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను. కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఉన్నారంట” అని చెప్పింది శివాని.

“అవునా… ఎంత మంచి విషయం చెప్పవే థాంక్యూ థాంక్యూ సో మచ్” అని చెప్పింది రజిని హుషారుతో పేషంట్ రూమ్ లోకి వెళ్ళింది.’రేపు ఉదయం వాళ్ళ అబ్బాయి వస్తాడని డాక్టర్ చెప్పారు కదా. అతన్ని ఎలాగోలాగా నా ప్రేమలో పడేయాలి అని అనుకుంది రజిని.’

మరుసటి రోజు రిసెప్షన్ దగ్గరకు వెళ్లి “పూర్ణ అనే పేషంట్ ఎక్కడున్నారండి” అని అడిగాడు విక్కీ.”రూమ్ నెంబర్ 80 అని చెప్పింది” రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయి.
విక్కీ వెనకాలే ఒక అబ్బాయి ఒక ఫోటో చూపించుకుంటూ “తనని ఎక్కడైనా చూశారా” అని అడుగుతున్నాడు. అక్కడున్న కొందరు పేషెంట్లు ఫోటోలు చూసి మాకు తెలియదు అండి అని చెప్పారు.

పూర్ణ రూమ్ కి వెళ్లి అక్కడ తనను చూసి” సిస్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది?” అని అడిగాడు విక్కీ.”ఇప్పుడు కొంచెం పర్లేదండి. రేపు డిస్టర్బ్ చేస్తారు” అని చెప్పింది రజిని.
“మీరు పేషెంట్ ని చూసుకోండి. నేను వెళ్తాను , కాసేపట్లో డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు” అని చెప్పి వెళ్ళిపోయింది రజిని.ఫోటో పట్టుకొని వెతుకుతున్న వ్యక్తిని చూసి భయంతో శివాని దగ్గరికి వెళ్లింది రజిని.

” హే… శివాని అతడు నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు అతన్ని వెంటనే పంపించే” అని బతిమిలాడుతూ చెప్పింది రజిని.”సరే… నేను చూసుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండు” అని చెప్పి శివాని అతని దగ్గరికి వెళ్ళింది.

“ఈ ఫోటోలో ఉన్న తనని చూశారా?” అని శివానిని అడిగాడు.”హా… చూశానండి. అక్కడ బస్ స్టాప్ ఉంది కదా. ఆ బస్ స్టాప్ దగ్గర చూశానండి ఒకసారి వెళ్లి చూసుకోండి” అని చెప్పి పంపించేసింది శివాని.అతను కొంచెం కంగారుగా పరిగెత్తాడు బస్టాప్ దగ్గరికి.శివాని వచ్చి “అతను వెళ్ళిపోయాడు నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు” అని చెప్పింది.

“సరే… థాంక్యూ” అని చెప్పి తను ఇంటికి వెళ్ళిపోయింది రజిని.విక్కీ ని ప్రేమలో పడేయడానికి ఎన్నో ప్లాన్ వేసింది చివరికి ఒక ప్లాన్ సక్సెస్ అయింది.
పూర్ణను కాపాడినట్టు నటించి విక్కీకి దగ్గర అయ్యి తన ప్రేమను గెలుచుకుంది రజిని. పూర్ణ కి కూడా రజిని అంటే  ఇష్టం ఉండడం వల్ల వాళ్ళకి పెళ్లి చేయడానికి ఒప్పుకుంది.
రెండు రోజుల్లో తర్వాత పెళ్లి అని ఫిక్స్ చేశారు.

ఫోటో పట్టుకొని తిరుగుతున్న అతని చూసి”రేయ్… కిరణ్ నువ్వేంటి రా ఇక్కడ నువ్వు ఎప్పుడు వచ్చావ్” అని అడిగాడు విక్కి” నేను వచ్చి చాలా ఇయర్స్ అయింది రా. కొన్ని కారణాల వల్ల ఇక్కడే ఉన్నానని చెప్పలేదు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసావా?” అని అడిగాడు కిరణ్” ఆ ఫోటోని చూడకుండా ఉన్నది ఎవరు?” అని అడిగాడు విక్కి.

“నన్ను ప్రేమించానని చెప్పింది. నేను నమ్మాను. పెళ్లి చేసుకున్నాము. కొన్నాళ్ళు నాతో పాటు ఉండి ఇంట్లో ఉన్న డబ్బు నగలతో వెళ్లిపోయింది. ఇది ఒక పెద్ద జగత్ కిలాడి. అందుకే తన ఫోటో పట్టుకొని తిరుగుతున్నాను” అని చెప్పాడు కిరణ్.

“అవునా… ఇంత జరిగిందా? జాగ్రత్తగా ఉండాలి కదరా కిరణ్. సరే రెండు రోజుల్లో నా పెళ్లి , నువ్వు తప్పకుండా రావాలి ఏది ఒకసారి ఆ ఫోటో చూపించు”  అని అడిగాడు విక్కి.
ఆ ఫోటో చూపించే లోపు విక్కికి ఫోన్ వస్తుంది.

హలో అమ్మ… హా సరే వస్తాను అని చెప్పి పెట్టేసాడు “సరే రా… నువ్వు పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలి” అని చెప్పి వెళ్ళిపోయాడు విక్కి.”తప్పకుండా వస్తాను” అని చెప్పాడు కిరణ్.

కిరణ్ శివాని ఉండే హాస్పిటల్ కి వెళ్ళాడు. ఆమె రజినీతో మాట్లాడుతున్న మాటల వింటూ పక్కన నిలబడతాడు.శివాని ఫోన్ పెట్టేసిన తర్వాత కిరణ్ ని చూసి ఆశ్చర్యంతో “మీరేంటి సార్ ఇక్కడ” అని తడబడుతూ అడిగింది.

“రజిని అంటే ఎవరు? ఆవిడని కలవడానికి వచ్చాను” అని చెప్పాడు కిరణ్.ఇంకా కంగారుపడుతూ “ఆమె రాలేదు. రెండు రోజుల్లో ఆమె పెళ్లి” అని చెప్పింది శివాని.”ఎవరితో పెళ్లి” అని అడిగాడు కిరణ్.

“విక్కీ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు” అని చెప్పింది శివాని.అప్పుడే వాళ్ళ దగ్గరకు డాక్టర్ వచ్చి శివాని
“రజిని ఎందుకు రాలేదు?” అని అడిగాడు.

“రెండు రోజుల్లో రజిని పెళ్లి ఉంది డాక్టర్. అందుకే తను తన జాబ్ కి రిజైన్ చేసింది” అని చెప్పింది శివాని.కిరణ్ చేతిలో ఉన్న ఫోటో కింద పడిపోవడం వల్ల అది చూసిన డాక్టర్ ఆ ఫోటోని చూస్తూ”రజిని ఫోటో నీ దగ్గర ఎందుకు ఉంది?” అని అడిగాడు.

“రజిని అనే పేరుతో మీ దగ్గర జాయిన్ అయ్యిందా?” అని అడిగాడు కోపంగా కిరణ్.”అవునండి. ఐదేళ్లుగా ఇక్కడే పని చేస్తుంది. రజినీకి శివాని మంచి ఫ్రెండ్ “అని చెప్పాడు డాక్టర్.
“అవునా… మరి ఆరోజు అడిగితే ఎందుకు అబద్దం చెప్పావ్” శివానిని చూస్తూ కిరణ్ అడిగాడు.

శివాని ఏం మాట్లాడలేదు.  శివాని చేయి పట్టుకొని విక్కీ వాళ్ళింటికి తీసుకొని వెళ్ళాడు కిరణ్.”ఏంట్రా కిరణ్ ఆ అమ్మాయి ఈ అమ్మాయేనా” అని అడిగాడు విక్కీ”ఆ అమ్మాయి ఈ అమ్మాయి కాదురా. నువ్వు వెంటనే రజిని కి ఫోన్ చేసి రమ్మని చెప్పు” అని చెప్పాడు కిరణ్.

విక్కీ ఏం ఆలోచించకుండా రజిని కి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు.రజిని చాలా హుషారుతో ఇప్పుడే “వస్తున్నానని” చెప్పింది.కిరణ్ పోలీసులకు ఫోన్ చేసి”అరగంట తర్వాత మీరు రండి సార్” అని చెప్పాడు.

రజిని రావడం చూసి కిరణ్ శివానిని చెయ్యి పట్టుకొని మేము “ఆ గదిలో ఉంటాం. తను వచ్చిన తర్వాత మేము వస్తాము” అని చెప్పాడు.విక్కీ అయోమయంగా చూస్తూ ఉన్నాడు.
సోఫాలో పూర్ణ కూర్చొని ఉంది.”ఏంటి విక్కీ ఫోన్ చేసి రమ్మని చెప్పావు” అని అడిగింది రజిని.

రూమ్ నుండి బయటకు వస్తూ”మళ్లీ పెళ్లి చేసుకుంటునప్పుడు నాకు చెప్పాలి కదా రజిని” అని మాట్లాడుతూ వచ్చాడు కిరణ్.నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని అడిగింది “ఏమే నాతో ప్రేమ అన్నావ్ , ఒప్పుకున్నా పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ళు తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు విక్కీకి ఆస్తి ఉంది కాబట్టి పెళ్లి చేసుకుంటున్నావ్. తర్వాత ఇంకెవరిని చేసుకుంటావు” అని అడిగాడు కిరణ్

విక్కీ నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసి వెళ్ళిపోయినా అమ్మాయి ఈ రజినియే. పెద్ద మాయలేడి, జగత్ కిలాడి అని చెప్తుండగా పోలీసులు వచ్చారు.విషయం అర్థం చేసుకున్న విక్కీ “నన్ను ప్రేమించానని నమ్మించి నా ఆస్తిని అనుభవించాలనుకున్నావా? సార్ తనని తీసుకొని వెళ్ళండి” అని చెప్పాడు.

“థాంక్యూ రా నా జీవితం బలికాకుండా కాపాడావు” అని చెప్పాడు విక్కి.”థాంక్స్ ఎందుకు లేరా,  నువ్వు నా ఫ్రెండ్ వి” అని చెప్పాడు కిరణ్.ఇకముందు అయినా పెళ్లి చేసుకునేటప్పుడు అన్నితెలుసుకుని చేసుకోండి.

 

-మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *