"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

మేదరులు

మేదరులు

ఇది చేతివృత్తి.వీళ్ళని మేదరులు అనేవారు.వారి హస్తకళా నైపుణ్యంతో రకరకాల బుట్టలు,పూల సజ్జలు,చాటలు,తాటి ఈనెల నుండి,కొబ్బరి ఆకులు,తాటాకులు,వెదురు ఈనెల తోటి ఎంతో కళాత్మకం తయారు చేసేవారు.

చాలా తక్కువ ఖరీదు కూడా. మాది కొల్లేరు పరీవాహక ప్రాంతం కాబట్టి
ఇప్పటికీ చేపలను బుట్టలలోనే అమ్ముతారు.

తాటాకు విసన కర్రలు ,వేసవిలో తేలికగా ఉండి చల్లటి గాలినిస్తాయి.

ఇంకా వెదురు విసనకర్రను పొయ్యిల మంటలను విసరటానికి
వాడేవాళ్ళం. ఇంకా వెదురు బద్దీలతో తడికలు
అల్లేవారు.వాటిని ఇంటిలో పెట్టి గదులుగా వాడేవారు.
బండ్ల కు గూడులు,తడికలు ఈ వెదురుతో తయారుచేసేవారు.

ఇప్పుడు ప్లాస్టిక్ మయం
అయిపోయి ఈ చేతి వృత్తుల వారికి కొంత పని
కొరవడిందనే చెప్పవచ్చు .

హస్త కళలను ప్రోత్సహిద్దాం.వారికి చేయూతనిద్దాం.

ఆ రోజులే వేరబ్బా!

ఇది నా స్వంత రచన

– రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *