మీకే తెలుస్తుంది

మీకే తెలుస్తుంది

నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి అమ్మ , నాన్నలు గొడవ పడుతూనే ఉన్నారు. అమ్మ కొన్నిసార్లు చనిపోతానని చెప్పిన మాటలు కూడా నేను విన్న ఎన్నోసార్లు. నాకు పెళ్లి మీద పెద్దగా అభిప్రాయం లేదు. సినిమా, సీరియల్స్ లో భార్యాభర్తల గురించి ఒక నిర్వచనం చెప్తారు. కానీ బయట ప్రపంచంలో మరొక నిర్వచనం కనిపిస్తుంది.  పెళ్లయిన కొత్తలో బానే ఉన్నా భర్త వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు అని తెలిసి ఎంతో బాధపడింది ఆ అమ్మాయి.

ఇద్దరు దగ్గర వాళ్లే పెద్దలు వాళ్ళకి పెళ్లి చేశారు. వాళ్లకి ఏ ఉద్దేశంతో పెళ్లి చేశారో నాకు మాత్రం తెలియదు కానీ ప్రతిక్షణం ఎప్పుడో ఒక దగ్గర గొడవ జరుగుతూనే ఉంది.  భార్య భర్తల మధ్య గొడవలు సహజమే. గిల్లికజ్జాలు లేకపోతే జీవితం బాగుండదు అని అంటారు పెద్దలు. ఒకరి బాధ ఒకరు తెలుసుకోవాలి ఒకరి ప్రేమ ఒకరు తెలుసుకోవాలి అని అంటారు కానీ రియల్ లైఫ్ లో అలా జరుగుతుందా?

పెళ్లయిన వాళ్లు పెళ్లి కాని వాళ్ళకి నీకు ఒక తోడు ఉంటుంది పెళ్లి చేసుకో అంటారు. కానీ నిన్ను అర్థం చేసుకునే పోయేవాడు వస్తాడు. నిన్ను బాగా చూసుకుంటాడు అని ఒకరు కూడా అనటం లేదు. ఒక భార్యని పెళ్లికి ముందు చదివిస్తానని తన తల్లిదండ్రులకు మాట ఇచ్చినా అల్లుడు. పెళ్లి తర్వాత ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే నువ్వు  ఎగ్జామ్ చదివి రాయగలవు , నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పకుండా నువ్వు ఏమి చేయలేవు వేస్ట్ దేనికి పనికి రావు అని చెప్పుకుంటే ఎలా ఉంటుంది ఆ అమ్మాయికి?

ఒక్క గొడవ జరిగింది. ఆ గొడవని తన దృష్టిలో పెట్టుకొని ఆ భార్య భర్తల మధ్య ఏం గొడవ జరిగిన  , భార్య ఏం మాట అన్నా మీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని పుట్టింటి వాళ్ళని తిడితే ఆ అమ్మాయి ఎలా పడుతుంది చెప్పండి? మీకు సమాధానం తెలిస్తే నాకు చెప్పండి? చిన్న బాబుతో ఆ ఇల్లాలు డిగ్రీ పూర్తి చేయాలి అని అనుకుంటూ ఆ భర్త తన లక్ష్యాన్ని నెరవేర్చుకుండా , నీకు నేను ఎగ్జామ్ ఫీజు కట్టను. డిగ్రీ చేయలేవు అని చులకనగా చెప్తుంటే ఆ అమ్మాయి మౌనంగా ఉండాలా? ఇలాంటివి మన చుట్టూ జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోమని అంటారా?

అందరూ అలాంటి వాళ్ళు కాకపోవచ్చు కదా అని ఒకే ఒక్క నమ్మకంతో పెళ్లి చేసుకుంటారు ఆడపిల్లలు. అలాగని మగవాళ్ళని నేను తప్పు పట్టట్లేదు.  వాళ్లు కూడా మంచి వాళ్లే.  నా చుట్టూ జరిగిన కొందరి విషయాలు చెప్తున్నాను అంతే.. భర్తలకు కోపం వస్తే మాత్రం ఇంట్లో ఉన్న వస్తువులను పగలుపొట్టతారు. మరి భార్యలకు కోపం రాకూడదా? భార్య , భర్తల దాంపత్యం ఎన్ని గొడవలు వచ్చిన ఆ పవిత్ర బంధానికి విలువ  ఇచ్చి కలిసి ఉంటున్నారు.

మన జీవితంలో వచ్చే భాగస్వామికి విలువ ఇవ్వడం వల్ల ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకుంటారు.
ఇద్దరు సమానంగా ఒకరిని ఒకరు తెలుసుకుంటూ అది అందమైన జీవితం అవుతుంది. కొందరిలో ఒకరు నిజమైన ప్రేమ చూపిస్తే మరొకరు నటిస్తారు. నా ఉద్దేశ్యంలో ఇద్దరు సమానంగా ఉండాలి. ఎవరు ఎక్కువ కాదు , తక్కువ కాదు అది తెలుసుకొని జీవిసే అందమైన జంటగా అన్యోన్యంగా ఉంటారు. పెళ్లి బంధంతో ఒకటవుతారు భార్య భర్తలు. ఆ బంధానికి విలువ ఇచ్చి సంతోషం గడపాలని అనుకుంటాము. ఎవరి జీవితం అయిన అంతే.

భర్తలకు కోపం కాసేపు మాట్లాడకండి, మౌనంగా ఉండండి. అంతే కానీ ఇంట్లో ఉన్న వస్తువులపై కోపం చూపించడం కాదు. అలాగని భార్యలకు కోపం వచ్చి ప్రతిసారి వాళ్లు ఇలాగే వస్తువుల పైన చూపిస్తున్నారా? కోపం , ఆవేశంలో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియడం లేదు. మన లోపాలను సరి చేసుకుంటే మన జీవితంలో వచ్చిన భాగస్వామికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. దాంపత్యం జీవితం ఎంతో గొప్పదైనది.  అది తెలుసుకొని మీ జీవిత భాగస్వామిని బాగా చూసుకోండి. భర్తల ప్రేమ ఉంటే చాలు భార్యలకు ఏం అవసరం లేదు..

ఇంట్లో వాళ్ల అన్ని అవసరాలు తీర్చేతూ అందరికీ ఇష్టమైన వంటలు చేస్తూ , తన గురించి ఏం పట్టించుకోకుండా ఇంట్లో జరిగే ప్రతి గొడవని తనదై తప్పు అని చెప్పి నిందించడం ఇది ఎక్కడని న్యాయం. అమ్మ, నాన్న లు పిల్లలు మంచి కోరే చెప్పుతారు. కానీ అది మాత్రం పట్టించుకోకుండా వాళ్లే దారిలోనే వెళతారు.  ముందు చెప్పితే లేదు ఆ దారిలోనే నా ప్రయాణం అంటారు. ఒకవేళ చెప్పకపోయినా మాకు ముందే ఎందుకు చెప్పలేదు అని నిందిస్తారు ఇది ఎక్కడని ధర్మం. ఒక కాసేపు కూర్చుని ప్రశాంతంగా ఆలోచించండి. మీకే తెలుస్తుంది మీరు చేస్తుంది.

– మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *