మెరుపు

మెరుపు

అనంతమైన ఆకాశంలో

మెరిసిన మెరుపుల
నిను చూసిన క్షణం
లిప్త కాలమైనా
నా కంటి పాపలో
నీ ప్రతిరూపం
నిక్షిప్తమై పోగా
కనులు మూసిన నీ రూపం
కనులు తెరిచిన నీ రూపం
కనుల యెదుట కదలాడుతుంటే
నిను ఎలా మరువ గలను
నిను ఎలా దరి చేరగలను
అల్లంత దూరాన నీవు
సూదూర తీరాన నేను
ఎప్పుడైనా ఎక్కడైనా
ఈ జన్మకు ఒకసారైనా
కలుస్తామనే ఆశ
అదే శ్వాసగా సాగిపోయే
ఓ… అజ్ఞాతవాసి.
– అంకుష్

Related Posts