మిణుగురు

మిణుగురు

వెదురులోన ఒదిగినట్టి ఊపిరిగానం తనదేలే
ఎదురులేక ఎదిగినట్టి ఆత్మాభిమానం తనదేలే

కాటికికాలుజాపు వయసులోన కష్టజీవి నీవేలే
వయసుడిగిన పగలురేయితిరిగే కాలచక్రం నీవేలే

ఎవ్వనికి భారంగా కానీక నీకాయం శ్రమజీవి జోహరు
నీచేయి ఎపుడూ పైనుండు పేదరికం నీకు అడ్డుకాదు

చుట్టబెట్టు చాపల్లె అల్లుకున్న బంధాలు వదిలినా
అంతులేని విశ్వాసంతో చెంపపెట్టు నీ కృషి ఓ రుషి

వృద్ధాప్యం వెన్నంటి వంచలేదు నీలోని ఆత్మవిశ్వాసం
కునుకన్నది మరిచావో నీ సంకల్పం గొప్పది

రేయనక పగలనక ఎండనక వాననక నిద్రనక
గుప్పెడు మెతుకులకై నీ పోరాటం కంటతడి
పెట్టని హృదయం వ్యర్థం వ్యర్థం

– వింజరపు శిరీష

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *