‘మనీ’ షి
మానవత్వం ఏదో బూజు పట్టిన సిలకొయ్యకు
వేలాడుతుంది దయనీయ స్థితిలో….
ఎవరు ఎవరు ఎవరక్కడా….?
నన్నిలా…అనవసర ముసలికంపు పట్టించి…
అక్కరలేని సామానుల గదిలో తోశారేం…?
తెరలులేని గదిలో లయకార శబ్దవాణి…
తెలియజేస్తుంది… మనిషి కానీ ‘మనీ’షి
అస్తిత్వం ఇంకా కొనసాగుతుందని….
ఆహా ఓహో… పాడే కట్టిన పాత నోటైన
పెళపెళమను కొంగొత్త నోటైన….
చివరికి మనిషిని చేర్చేది స్వార్ధమను సమాధిలోకే
– కవనవల్లి