మూడు ముళ్ళు…

మూడు ముళ్ళు…

రెండు జీవితాలు ఒకటిగా కలిసే సుభసమయం…
ఇద్దరి ఆలోచనలు ఒకటిగా మారే శుభతరుణం…
కలకాలం కలిసుండడానికీ వేసే మొదటి అడుగుల ప్రయాణం…

ఇరువురికీ జ్ఞాపకాల దొంతరలు…
నిండు నూరేళ్ళ ప్రయాణ సంగమం…
తొలి అడుగులు మలిఅడుగులుగా మారే సమార్పణం…
రెండు తనువులు ఒకటిగా మారే సమయార్పణం…

కాలాల పరీక్షకు తొలి అడుగు…
భవబాంధవ్యాల ప్రయాణం…
కొత్త కొత్త ఆనందాలకీ నెలవు…
ఒకరినొకరు బాసల ప్రయాణం…

మూడే ముళ్ళు ఏడే అడుగులుగా సాగే ప్రయాణానికి తొలిప్రమాణం…

– గోగుల నారాయణ

Related Posts