మృధు మధుర మాయ

మృధు మధుర మాయ

కొత్త ఆశలు కళ్ళలో మెరిసే
పెదవుల చిరు నవ్వే
పది వేల కోట్లు….
ఇంత ఆశా భావమా
ముఖారావిందం లో….
మది చలించిందా…
హృదయ లోయలో
పసి పాప అమాయక రూపం
శక్తి స్వరూపం….
అవధులు లేని ప్రేమ బింబమే
జీవితంలో తన వారి కోసం
త్యాగాల ప్రతిబింబమే
తానే కదా సత్యం శివ సుందరం
అందమే సంతృప్తి అయి మెరిసింది మది లో యదలో….

– అల్లాఉద్దీన్

Related Posts