మూడు ముళ్ళ బంధానికై

మూడు ముళ్ళ బంధానికై

మూడు ముళ్ళ బంధానికై

తలపై ముసుగుతో చెవులకు
పట్టని ఆర్తనాధాలను వినిపించక…
తన చేతుల చలువతో లాలింపుగా
ఓలలాడింది లోకాన నెగడేది తన
సంతతేనని…సహనాన్ని ఈ మనుసుల
కోసం గూడు కట్టుకొన్నది కరుణ శీలిగా…

నుదిటికి తిలకంతో చూచే కంటికి
వెలుగవుతు…రేకెత్తిన మాలిన్యాలను
మమకారంతో కడుగుతు… శరణాగతి
పొందని దేహాలకు తెలవారుటను చూపుతు
ముక్కున ముక్కెరకు అందమై…బుగ్గన
సిగ్గులతో తలవంచెను మూడు ముళ్ళ
బంధానికై శాంతి మూర్తిగా….

వసంతంలో పొదిగిన మకరందం…
ప్రయత్నాలను కరుణించే దేవత
సమయం వాటిల్లనిదైనా…తలచిన
ఆలోచనలను మధిలో భావన చేస్తు…
క్షణాల సమదాయాలను సమయానంద
భరితంగా నడిపిస్తు…అవసరాన్ని
నిమిత్తమాత్రం కానీయక సాధించాలనే
తపన కలిగిన దీశాలి…

తలంపు తిరస్కార భావనతో
ఎదురింపైతే…కాళకూటమిని పంచే
అపరకాళీ….దయజూపిన మనస్సుకు
దాసోహం పలుకుతు నిత్య నైవేద్యాలతో
కొలిచే దైవానికై నూతన శఖంగా ప్రారంభ
మవుతు….మడిలో మొలకగా పెరుగుతు
నానుడిలో ఎరుకను కలిగిన భావస్వేచ్చతతో
అంకిత భావాన్ని చూపే దయాశీలి…

 

-దేరంగుల భైరవ 

సాయి చరితము-181 Previous post సాయి చరితము-181
ఆడుకొనేఆటబొమ్మగా  Next post ఆడుకొనే ఆట బొమ్మగా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close