ముగ్గురి మనసులు చివరి భాగం

ముగ్గురి మనసులు చివరి భాగం

ముగ్గురి మనసులు చివరి భాగం 

 

కాసేపు నాకు ఏమీ అర్థం కాలేదు.., మౌనంగా ఉండిపోయాను..,రాత్రి ఆనంద్ రూమ్ కి వచ్చాడు., నాతో ఏవేవో చెప్తున్నాడు.., సిరి గురించి అడుగుతున్నాడు.., కానీ…నా పరిస్థితి.. నా బాధ.. వాడికి తెలియదు…చాలా సేపు తర్వాత ఏమైందిరా..? మాట్లాడు…? అని పిలిచాడు…సిరి వచ్చిందా..?జాగ్రత్తగా ఇంటికి వెళ్లిందా..?నువ్వు దింపావా..? తనే వెళ్లిందా..?చెప్పరా సంతోష్..! మాట్లాడు..?అని అడుగుతున్నాడు… లేదురా తనే వెళ్ళిపోయింది, ఇంకా వెళ్లినట్టు ఫోన్ చేయలేదు, అని చెప్పాను..

నీకు ఎన్ని సార్లు చెప్పాను..! తనని అలా పంపొద్దని.. అంటూ ఫోన్ తీసి సిరి కి చేయబోయాడు.., నేను వెంటనే ఫోన్ లాక్కుని…నేను చేస్తాను లే..! అని ఫోన్ చేసి.., వెళ్ళావా..? అని అడిగాను..తను వెళ్లాను అని చెప్పి ఫోన్ పెట్టేసిందిఅదేంటిరా అంత తొందరగా పెట్టేశావు.? నాకు ఇస్తే నేను మాట్లాడుతాను కదా.., సిరి తో మాట్లాడి చాలా సేపు అయింది… అన్నాడు…

ఆనంద్ భయాన్ని.., బాధ్యత…!ఇష్టాన్ని.., ప్రేమ..! అనుకున్న సిరికిఆనంద్ నీ మీద పెట్టుకున్నది ప్రేమ కాదని… స్నేహమని, ఆమెకి…సిరి నీ మీద పెట్టుకున్నది ప్రేమ అని… సిరిని పెళ్లిచేసుకోమని, ఆనందికి…చెప్పే ధైర్యం..! ఒప్పించే శక్తి..!దీనివల్ల స్నేహం పాడైతే తట్టుకోగలిగే ప్రాణం నాకు లేవు…!కానీ చెప్పక తప్పదుధైర్యం పెంచుకుని..! శక్తిని తెచ్చుకుని..! ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని..! మధ్యాహ్నం పెళ్లి శుభలేఖ దగ్గర నుంచి.., సిరి నా మీద పెట్టిన పెళ్లి ప్రస్తావన వరకు…, ఆనంద్ కి చెప్పేశాను..!

డైరీ లో తర్వాత పేజీ తిప్పాను..!  కానీ అదే ఆఖరి పేజీ !

ఆ తర్వాత నేను డైరీ రాయడం ఆపేశాను. ఇంతలో…

**************

ఎవరో తలుపు కొట్టారు.., ఆనంద్ తలుపు తీసి గట్టిగా అరుస్తున్నాడు.. ఏంట్రా ఏమైంది..? ఎందుకు అరుస్తున్నావు అని డైరీ పక్కన పెట్టేసి కళ్లు తుడుచుకుంటూ వాడి దగ్గరికి వెళ్లాను…ఇతనికి ఎన్నిసార్లు చెప్పినా మన ఉత్తరాలు వచ్చిన నాలుగు రోజులకు గానీ ఇవ్వట్లేదు…!చూడు సిరి ఉత్తరం వచ్చి మూడు రోజులు అయింది..,ఇప్పుడు తెచ్చాడు.. అని వాచ్ మెన్ మీద కోపంగా ఉన్నాడు ఆనంద్..

సరే మందు ఉత్తరం చూడు ఏం రాసిందోఅని లోపలికి తీసుకువచ్చానుఉత్తరం చదివి, ఇవాళ డేట్ ఎంత రా..? అని అడిగాడు.. క్యాలెండర్ దగ్గరికి పరిగెట్టి.., రేపే సిరి ఇండియా వస్తోంది రా..! అని గంతులు వేసుకుంటూ నా దగ్గరికి వచ్చాడు… నాకు చాలా ఆనందం వేసింది.. ఒక రెండు రోజులు ముందు ఈ ఉత్తరం మాకు ఇచ్చినా బావుండేదనిపించింది. సరే రేపు నేను ఎయిర్ పోర్ట్ కి వెళ్తాను.., నువ్వు ఆఫీస్ కి వెళ్ళు…, అని ఆనంద్ కి చెప్పాను..

ఒరేయ్..! మర్చిపోయావా..? రేపు నీకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది దానికి నేను లేకపోయినా పర్లేదు కాబట్టి నువ్వు ఆఫీస్ కి వెళ్ళు.., నేను సిరిని పిక్ అప్ చేసుకుంటాను…అన్నాడు ఆనంద్… నాకు ఏదో భయం వేసింది వీడు వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో..? నేను ఊహించగలను..!అందుకని మళ్ళీ వద్దని చెప్పాను.., కానీ నా మీటింగ్ వల్ల నేను ఆఫీస్ కి కచ్చితంగా వెళ్లాల్సి వచ్చింది…, వేరే దారి లేక వెళ్ళమన్నాను..

సిరి రాసిన ఉత్తరం ఒకసారి ఇవ్వు నేను చదువుతాను.. అని ఉత్తరం చదవడం మొదలు పెట్టాను…ప్రతి వారం, ఆ వారం జరిగిన విషయాలన్నీ మాకు ఉత్తరం రాస్తుంది…హాయ్ ర…!

ఎలా ఉన్నారు..? ఈ వారం ఇక్కడ చాలా ఆనందంగా గడిచింది…

రాహుల్ ఈ వారమంతా ఇంట్లోనే ఉన్నాడు

నాతో ఒక్క పని కూడా చేయించలేదు… ఇండియా కి టికెట్లు బుక్ చేశాడు…

గురువారం బయలుదేరుతాను

ఇక్కడ రాహుల్ ని వదిలేసి వెళ్ళడం బాధగా ఉంది.. కానీ డెలివరీ కి ఇక్కడ కష్టమవుతుంది, అందుకనే అమ్మనాన్న దగ్గరికి పంపిస్తానని ధైర్యం చెప్పి… నేను ఒక రెండు నెలల్లో వస్తానని చెప్పాడు….

ఒకపక్క రాహుల్ ని విడిచి పెడుతున్నా అనే బాధ.., శుక్రవారం పొద్దున మీ దగ్గరకు వస్తాను అని ఆనందం…,

రెండు మనసుకి ఒకే బరువు అనిపిస్తున్నాయి…!

సరే శుక్రవారం పొద్దున్నే ఎయిర్పోర్ట్ కి రండి… రెండేళ్ల ఆగాను…, ఎయిర్పోర్టులో దిగగానే ఆగలేను..!

అని రాసింది

పొద్దున్నే ఆఫీస్ కి బయలుదేరానుబాస్ ని కలిసి, మీటింగ్ ని సోమవారానికి పెట్టగలరా..?అని అడిగాను… ఎందుకు?? అని అడిగారు…సిరి ఇవాళ పొద్దున్నే ఇండియాకి వస్తోంది.., ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి.., అని చెప్పాను…ఒక పది నిమిషాల్లో కనుక్కొని చెప్తా అన్నారు… వెయిట్ చేశాను… ఆయన పిలిచి.., సరే సోమవారం పెట్టుకుందాం..వెళ్లి సిరి నీ పికప్ చేసుకోమని చెప్పారు

వెంటనే ఎయిర్పోర్ట్ కి బయలుదేరాను.., సిరి వచ్చేసి ఉంటుంది..! అని వెతుకుతున్నాను..ఇంతలో చెక్ అవుట్ దగ్గర దూరంగా… ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తోంది తన రెండు చేతుల్లోనూ బ్యాగులు.., పైగా హీల్స్.., వంకరగా నడుచుకుంటూ ఆ బరువుకి పక్కకి పడుతుండగా.. చేత్తో పట్టుకుని కింద పడకుండా పైకి లేపాడు.. వాళ్ళిద్దరి కళ్ళల్లో ఒక వెలుగు.., ఓ సంతోషం.., తెలియని బాధ.., అన్నీ కలిసి కరిగి వాళ్లకి తెలియకుండానే కారిపోతున్నాయి…

అవి చూసి నా కళ్ళు ఆనందంతో మసకలు కమ్ముతున్నాయినాకు ఏమీ కనబడట్లేదు..! నేను తరుముకుంటూ..,కళ్లు తుడుచుకుంటూ.., వారిద్దరి దగ్గరికి వెళ్లాను…

నేను వెళ్ళగానే.. అతను, నన్ను చూసిన ఆనందంలో ఆమెని, నాకు చూపిస్తూ.. కళ్ళు తుడుచుకొంటూ.. నన్ను హత్తుకున్నాడు… ఆమె, నా కళ్ళు తుడుస్తూ.. నా దగ్గరకి చేరింది….  నేను, ఆమెని కూడా దగ్గరికి తీసుకున్నాను….

ఆ క్షణం, ఓ స్వర్గం…! ఆ అనుభూతి, మూడు మనసులు కలిసిన స్నేహ సంగమం…!అక్కడ చూసే వాళ్ళెవరికీ తెలియనిది.., దక్కనిది..,ఆ అమ్మాయే ‘సిరి’ నన్ను హత్తుకున్న వాడు ‘ఆనంద్’ముగ్గురం కలిసి రూమ్ కి వెళ్ళాముఆనంద్… మనకు ఇంకో ఫ్రెండ్ వస్తున్నాడురా.. అని సిరిని చూస్తూ మురిసిపోతున్నాడు…

వాడి ఆనందాన్ని చూసి, సిరి ఇంకా మురిసిపోతోంది…నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు…!అలా సరదాగా.., జరిగిన విషయాలు, జరగబోయే విషయాలు, సిరి విషయాలు, ఆఫీస్ విషయాలు, అలా తను లేని రెండేళ్ల విషయాలు, మాట్లాడుకుంటూ ఉండగా..,రాహుల్ ఫోన్ చేశాడు.. ఎయిర్ పోర్ట్ కి మేం వచ్చామని, ఇంకో గంటలో అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాను, అని తను చెప్పింది…

సిరి వాళ్ళ నాన్న ఫోన్ చేసి, నేను కార్ పంపిస్తాను.. ఇంటికి వస్తావా..? అని అడిగారుఇంతలో ఆనంద్ ఫోన్ తీసుకొని మేము దింపుతాం అంకుల్…! అని చెప్పాడు..గడిచిన ఏడేళ్ళు పంచభక్ష పరమాన్నాలతో భోజనం అయితే..!ఈ గడిచిన ఏడు గంటలు కళ్ళ నిండుగా ప్రశాంతంగా పడుకున్న సంతృప్తి..!ఇంతకన్నా బ్రతకడానికి ఇంకేం కావాలి….!సిరిని వాళ్ళ ఇంట్లో దింపడానికి బయలుదేరాము

దారిలో మేము తిరిగిన వీధులు, తిన్న రెస్టారెంట్లు, సినిమా చూసిన థియేటర్లు, ఆ జ్ఞాపకాలు.., తలుచుకుంటూ సిరిని వాళ్ళింట్లో దిగబెట్టి రూమ్ కి వచ్చాము….నేను ఫ్రెష్ అయి బాల్కనీ లోకి వచ్చాను… ఒక్కసారి ఆనంద్ కళ్ళని చూశాను..! ఎర్రగా మారాయి వాడి మొహం చూడగానే… నాకు చాలా భయం వేసింది….!! ఏమైంది రా.. అలా ఉన్నావు అని వాడి దగ్గరికి వెళ్లాను..

బాల్కనీలో నేను చదివి అక్కడే వదిలేసిన డైరీలోని ఆఖరి పేజీ చదివాడని నాకు అర్థమయింది….చెప్పు సంతోష్ ఎందుకిలా చేశావు..?నాకెందుకు చెప్పలేదు..? మీరు పడ్డ బాధ నాతో ఎందుకు పంచుకోలేదు..?అని అడుగుతున్నాడునేను ఓ దోషిలా వాడి ముందు మోకాళ్ళ మీద కూర్చున్నానునేను చేసింది తప్పే.. నన్ను క్షమించు..అని తలదించుకుని ఉండిపోయాను…. సిరి వచ్చిందని.., ఆ అమ్మాయి శుభలేఖ ఇచ్చిందని.., చెప్పావు. కానీ నువ్వు, సిరి పడ్డ బాధ…

సిరి చెప్పిన పెళ్లి విషయం నాకు ఎందుకు చెప్పలేదు…?అని మా బాధని ఊహించుకుని,  బాధపడుతున్నాడని నాకు అర్థం అయింది….నన్ను పైకి లేపాడు, నేను పడుతున్న పశ్చాత్తాపం వాడికి అర్థం అయింది..నాకెందుకు చెప్పలేదు..? సంతోష్…ఏదో ఒకటి మాట్లాడు రా.., అని కోపంగా అడిగాడు…ఒకవేళ ఆ పెళ్లి విషయం నీకు చెప్తే నువ్వు ఏం చేసేవాడివి…?నువ్వు ఏం మాట్లాడేవాడివి…?పెళ్లి చేసుకునే వాడివా..?సిరి తో మామూలుగా ఉండగలిగే వాడివా..?

అని ఆనంద్ ని అడిగాను… వాడు అలాగే కింద కూర్చుని పోయాడు.. నేను వాడి పక్కన కూర్చున్నాను, వాడి చెయ్యి పట్టుకున్నాను,ఒరేయ్..! మా బాధ నీకు చెప్పినా తరువాత, నువ్వు ఏం అనుకుంటావో..!  ఎలా బాధ పడతావో..! ఊహించలేకపోయాను..డైరీ లో నీకు చెప్పినట్టు రాశాను కానీ.. ముందు ఆ విషయాన్ని చెప్పే ధైర్యం, విషయం చెప్పాక నువ్వు పడే బాధని,చూసి తట్టుకునే శక్తి నాకు లేక చెప్పలేకపోయానుఅని నేను పడ్డ బాధని చెప్పాను

నీ పరిస్థితుల్లో నేనున్నా అదే చేసేవాణ్ని ఏమోరా..?ఇంతకీ ఆ తర్వాత నువ్వు సిరికి ఏం చెప్పావ్..?సిరి మళ్లీ మనతో స్నేహంగా ఎలా ఉంది..? అని అడిగాడు..తర్వాత రోజు ఆఫీసులో సిరి నన్ను ఎక్కడ ఈ విషయం అడుగుతుందని, తప్పించుకుంటూ తిరిగాను…ఎందుకంటే..?ఆనంద్ కి  విషయం చెప్పావ..? అని అడిగితే చెప్పలేదు.. అని సిరి దగ్గర చెప్పలేను..,

ఒకవేళ నీకే పెళ్లి విషయం చెప్పి ఉంటే.. నువ్వు అనే మాటలు.., పడే బాధ తనకి నేను చెప్పలేను…,కానీ  ఆ రోజు సాయంత్రం  నువ్వు మీటింగ్ లో ఉన్నప్పుడు  సిరి  నన్ను పిలిచింది… వెళ్లాను..కాసేపు ఏమీ మాట్లాడలేదు,తను మాట్లాడడం మొదలు పెడితే.. అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు.. నిస్సహాయుడిల కూర్చున్నాను… కాసేపటికి..,

నన్ను క్షమించు సంతోష్..!పెళ్లి కన్నా స్నేహం గొప్పది…. పెళ్లి చేసుకుంటేనే స్నేహం ఉంటుందా…?పెళ్లి చేసుకుంటే స్నేహితులు అవుతామా..?రాత్రి ఇంటికెళ్లాక నాన్న నాత్తో, అమ్మ సిరి..! నీకు ఒక సంబంధం వచ్చింది అమ్మ, అబ్బాయి అమెరికాలో ఉంటాడు,

ఐదేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి సెటిల్ అవుదామని అనుకుంటున్నాడు. అబ్బాయి ఫోటో ఇదిగో, ఐదేళ్ల తర్వాత వచ్చేస్తాడు కాబట్టి నాకు కూడా అంత బెంగగా ఉండదు నేను కూడా మా అమ్మాయి అమెరికాలో ఉందని చెప్పుకోవచ్చు… ఈ రెండూ నాకైతే నచ్చాయి అబ్బాయి కూడా మంచివాడు మనకు తెలిసిన వాళ్లే.., నీ నిర్ణయం చెప్పు…

ఏమ్మా అలా ఉన్నావ్..! నాన్న..!  నేను ఆనంద్ ని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను..అవునా!! మరి ఈ విషయం ఆనంద్ కి  చెప్పావా?? చెప్పావా లేదు??

నాన్న.., ఇవాళ ఆనంద్ ఆఫీస్ కి రాలేదు, సంతోష్ కి చెప్పాను.. ఆనంద్ ని నేను పెళ్లి చేసుకుంటానని.. ఆ విషయాన్ని ఆనంద్ కి చెప్పమని….సిరి!! నా ఒక ప్రశ్నకు సమాధానం చెప్తావా…  ఏమిటి నాన్న??

నీకు ఆనంద్ ఎక్కువ.? సంతోష్ ఎక్కువ.?అదేంటి నాన్న అలా అడుగుతారు, మమ్మల్ని 7 ఏళ్ల నుంచి చూస్తున్నారు మీకు తెలియదా నాకు ఇద్దరు రెండు కళ్ళ ని నాకు ఇద్దరూ సమానమే…మరైతే నీ ఎదురుగుండా ఉన్న సంతోష్ నే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం మానేసి., ఆనంద్ ని ఎందుకు పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు..??

దీనికి నీ దగ్గరే కాదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎవరికైనా సమాధానం దొరకదు… ఎందుకంటే,నీ ఆలోచన మీ ముగ్గురు కలిసి ఉండాలని, అంతేగాని పెళ్లి చేసుకోవాలని కాదు.. అందుకే ఆ క్షణంలో నీకు దూరంగా ఉన్న ఆనంద్ ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడావు కానీ నీకు దగ్గరలో ఉన్న సంతోష్ ని నువ్వు చూడలేదు, ఒకవేళ ఆనంద్ కూడా మీతోనే ఉంటే అప్పుడు నీ మనసులోకి పెళ్ళి అనే ఆలోచనే వచ్చి ఉండేది కాదు…

ఎందుకంటే నీకు ఆ ఇద్దరూ నీ దగ్గరే ఉండేవాళ్ళు. నువ్వు తీసుకున్న నిర్ణయంలో ఆలోచన కన్నా భయం ఎక్కువ ఉంది ఆ భయం స్నేహాన్ని ఎక్కడ కోల్పోతానో అని., స్నేహం అనేది ఇంత దూరం లోనే ఉండాలని., అంత దూరంలో ఉంటేనే నీ స్నేహం బాగుంటుంది., అనేది ఉండదు అమ్మ…

నాకు స్నేహితులు ఉన్నారు సంతోషం వచ్చినా, బాధ కలిగిన పంచుకోవడానికి స్నేహితులున్నారు. వాళ్లు నా దగ్గరే ఉండాలని రోజు కలిసి మాట్లాడాలని ఉండదు, ఒకవేళ నువ్వు సంతోష్ ని లేదా  ఆనంద్ ని గాని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసుకున్న అతను నీకు భర్త అవుతాడు. కానీ స్నేహితుడు ఎలా అవుతాడు??

పెళ్లి అయిన తర్వాత స్నేహం ఉంటుందనే నమ్మకం లేదు, బాధ్యత మాత్రమే ఉంటుంది.. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా  మీ స్నేహం ఎప్పుడూ శాశ్వత మే నీ ఆలోచనని, భయంతో కాకుండా శాంతితో ఆలోచించు నువ్వు చేసింది ఎంత పొరపాటో నీకు తెలుస్తుందినీకు ఒక విషయం చెప్పనా సిరి

మనకు ఎవరి మీద అయినా బాధ వస్తే ఆ బాధలో మనం తీసుకునే నిర్ణయం ఆ వ్యక్తికి మనకు ఉన్న బంధాన్ని బలపరచాలి అంతేగాని ఆ తీసుకున్న నిర్ణయానికి బంధుత్వాలు చెడ కూడదు.ఇంకొక విషయం… చాలా ఆలోచించి ఒక తండ్రిగా ఈ సంబంధం నీకు చేద్దామని నిర్ణయించుకున్నాను నీకు కూడా నచ్చితే చెప్పురాత్రి ఆలోచించాను.., నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, నీ మనసుని బాధ పెట్టాను..

నాకు తెలుసు నువ్వు ఈ విషయం ఆనందికి చెప్పలేదని..,ఒకవేళ చెప్పు ఉంటే, రోజు లాగా ఆనంద్ నాతో అంత ప్రశాంతంగా మాట్లాడేవాడు కాదునువ్వు నా నుంచి తప్పించుకుని వెళ్లే వాడివి కాదుమనం స్నేహితులుగానే ఉందాం, పెళ్లయిన తర్వాత కూడా మన పెళ్లి బంధం కన్నా స్నేహబంధం గొప్పది అని నిరూపిద్దాం..నన్ను క్షమించు… అని చెప్పింది..

ఆ క్షణం ఏదో తెలియని ప్రశాంతత, దాదాపు 15 గంటలు నేను పడ్డ బాధ ఒక్కసారిగా ఆనందమై కరిగి కారి పోయింది..,పట్టిన మబ్బులు విడిపోయాయి..,ఆ తర్వాత సిరి కి పెళ్లి కుదరడం, చేసుకుని వెళ్ళిపోవడం, నీకు తెలిసిందే…సిరి వెళ్లిపోయిన తర్వాత నుంచి నేను డైరీ రాయడం మానేశా ఎందుకంటే మనిద్దరి విషయాలు మామూలే

అందుకే ఆ తర్వాత నుంచి సిరి పంపే ఉత్తరాలు మాత్రమే మనం చదువుకుంటున్నాం..అని చెప్పాను నా జీవితంలో ఆ సిరిలూ ఈ సంతోషాలూ లేకపోతే నాకు ఆనందం ఏదిరాఅని సంతోష్ తో ఆనంద్ చెప్పి సిరి గురించి తలుచుకుంటూ పడుకున్నారు.

 

ప్రేమకన్నా స్నేహం గొప్పది.

అయిపాయింది. శుభం

 

 

-శ్రీ కిరణ్

 

 

 

ముగ్గురి మనసులు మొదటి భాగం Previous post ముగ్గురి మనసులు మొదటి భాగం
సిటీ బ్రతుకులు Next post సిటీ బ్రతుకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close