ముఖారవిందము

ముఖారవిందము

సమాజము
అద్దమై మెరవంగ,
నిన్ను నీవు
సరిదిద్దుకునే కాలము
కాటి దిక్కు పోతుండె!.

నీ ముఖారవిందము
బృఖుటితమైన,
ఇచ్చునా సమాజము
నీకు చిరుమందహాసము!

నీ ఊల గోలకి
ఊలలే చేరును కదా…..!
నీ వెక్కిరింతలకి
పులకరించి,
పలుకరించునే
తిరిగి వెక్కిరింతలు.

నీకు
తెలియరానిదా…….!
నీలో ని ఈ మార్పు.

ప్రేమనిచ్చిన
ప్రేమనే పొందుదువు
కదరా…………….!

నీ చిరునవ్వు
సిరులౌట చిత్రమౌన?

– వాసు

Related Posts