మూలం
సృష్టి పుట్టుకకు మూలం అమ్మ
అనుబంధాలకు బంధం అమ్మ
నిస్వార్థ సేవ కు సాక్షి అమ్మ
చిరకాల స్నేహబంధం అమ్మ
తెలుగు భాషలో తీయనైన పదం అమ్మ
కమ్మనైన కావ్యా రూపం అమ్మ
మధురమైన సాహిత్య ప్రవాహం అమ్మ
తొలి గురువు అమ్మ
అన్నింటా అమ్మ
అంతటా అమ్మ
ఈ జీవితమే అమ్మదైనప్పుడు..
అమ్మ కు ఏమిచ్చి రుణం తీర్చగలం..
తిరిగి మనం ఆమె కు అమ్మగా పుట్టడం తప్ప 🙏🙏🙏
మాతృమూర్తి దినోత్సవ శుభాకాంక్షలు..
– కిరీటి పుత్ర రామకూరి
చాలా చక్కగా వ్రాసారు.