ముసిరిన చీకట్లు

ముసిరిన చీకట్లు

ఖాళీ అయిన
సభావేదికలా
చిక్కని చీకటి
అంతుచిక్కని తత్వవేత్త

అంతేలేని ఆకాశంలో
పొడిచే చుక్కలు
ఆకుదాచిన వానచినుకులై
మురిపిస్తుంటాయి

వంటరితనానికి
జ్ఞాపకాల దుస్తులేసి
చీకటి ముద్దు చేస్తుంటుంది
కాలం జారిపోతుంటుంది

ఆలోచనలన్నింటిని దండచేసి
మనసును దండించే ప్రియ శత్రువు
చీకటి స్పర్శ చల్లగా తాకుతుంటే
వెళ్లిపోయిన అమ్మ వళ్ళంతా తడిమినట్టుంటుంది

– సి. యస్. రాంబాబు

Related Posts