మువ్వల సవ్వడి

మువ్వల సవ్వడి

నాకు చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉండేది. నేను కాళ్ళకు పట్టిలు పెట్టుకుని తిరగాలి అని, అదేంటి అదో పెద్ద కోరికనా అంటారా అవునండి అది నా వైపు నుండి చుస్తే పెద్ద కోరికే మరి, అయినా మీకేం తెలుసు నా బాధ! అయినా నా కోరిక తీరదు అని నాకు తెలిసిపోయింది లెండి అది ఎలా అంటారా.. వినండి మరి .. 

నేను చిన్నగా అంటే పారాడే వయసులో ఉన్నప్పుడు నా కాళ్ళకు రాగి గజ్జెలు వేస్తారు కదా అవి వేసారన్న మాట, అలా వేసిన కొన్నిరోజులకు, ఎలా ఉడిపోయిందో ఏమిటో అందులోంచి ఒక గజ్జ ఉడిపోయింది. దాన్ని నేనుడుకుంటూ, ఆడుకుంటూ దాన్ని నోట్లో పెట్టుకున్నాను అన్న మాట. అది నా గొంతులో ఇర్రుకుపోయి, నేను చనిపోతనేమో అన్నంత హడావుడి చేశానంట. ఇక అప్పటి నుండి నాకు మువ్వలు కట్టడం మానేసారు మా ఇంట్లో వాళ్ళు.

కానీ పెద్ద వాళ్ళు వద్దు అన్నది మనకూ కావాలి అనిపిస్తుంది కదా, అలాగే నేను కూడా అయిదేళ్ళ వయస్సు లో నాకు పట్టిలు కావాలి అని పేచి పెట్టినప్పుడు మా అమ్మ గారు పట్టిలు కొన్నారు. కానీ వాటికీ ఒక వైపునే గజ్జెలు ఉన్నాయి.

అవి చూసి నేను ఇవి నాకొద్దు అంటూ వాటిని విసిరి కొట్టి ఏడ్చాను. అప్పుడు మా అమ్మగారు నన్ను బాగా బుజ్జగించారు అయిన నేను ఊరుకోకుండా ఏడవడంతో నా నస భరించలేక రెండు తగిలించారు. దాంతో నేను నోరు మూసుకున్నాను మళ్ళి ఏడో తరగతిలో అనుకుంటా మళ్ళి పట్టిల కోసం ఏడ్చాను. మా అమ్మ సారి ఏమి అనకుండానే కొన్నది. కానీ వాటికీ కూడా ఒక వైపునే గజ్జెలు ఉన్నాయి.

అది చూసి అవి నాకొద్దు అంటూ పడేసాను. నాకు చుట్టూ గుత్తులు గుత్తు లుగా మువ్వలు ఉన్న పట్టిలు కావాలని అన్నాను అమ్మ తో,..

ఏంటి గజ్జెలు వేసుకుని గజ్జెల గుర్రంలా తిరుగుతవా, బుద్దుందా అసలు అంటూ మా అమ్మ నా వైపు ఉరిమి చూసింది. ఆడపిల్ల మువ్వలు వేసుకుని ఇంట్లో తిరిగితే లక్ష్మి దేవి తిరిగినట్లుగా ఉంటుంది అంటారు. అదేంటో మా అమ్మనేమో ఇలా అంటుంది అని నేను ఆశ్చర్య పోయాను. మాటలకూ నాకు చాల బాధగా అనిపించింది. ఏమి చేస్తా, బాగా చదువుకుని, ఉద్యోగం చేస్తూ, డబ్బు సంపాదించుకుని మువ్వలు కొనుక్కోవాలని  మనసులో దృడమయిన నిర్ణయం తీసుకున్న తర్వాత హయిగా నిద్ర పట్టింది ఆ రాత్రి

మళ్ళి ఇంటర్లో అనుకుంటా అమ్మని మళ్ళి అడిగాను నాకు పట్టిలు కావాలి అని, వాటికీ చుట్టూ గజ్జెలు ఉండాలి అని ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పను. కానీ అమ్మ మాత్రం ఇప్పుడా గజ్జెలు వేసుకుని తిరిగితే అందరి దృష్టిలో పడతావు అంటూ మళ్ళి ఒక వైపు ఉన్న పట్టేలే కొంది. పట్టిలు వేసుకోవడానికి ఇన్ని oక్షలా  అని మీకు కూడా అనిపిస్తుంది కదా, వాటిని వేసుకునేది మగాళ్ళని ఆకర్షించడానికా, ఇది మీకు కూడా కొంచం ఓవర్ గా అనిపించింది కదా..

సరే ఇక రాత్రి గట్టిగా నిర్ణయించుకున్న జీవితంలో అమ్మని పట్టిలు కొనిమని అడగకూడదు అని. వాటిని నా స్వంత డబ్బుతో, నాకు నచ్చినవి కొనుక్కోవాలని, వాటిని పెట్టుకోవాలని అనుకున్న, అలాగే రాత్రి పగలు కష్టపడి చదివా, మధ్యలో మా అమ్మ ఆడపిల్లకి చదువు ఎందుకు అని అంటున్నా మా నానగారు చదువులో నా ఇంట్రెస్ట్ చూసి  అమ్మ మాట కాదని బాగా చదివించారు.

ఉద్యోగం దొరికింది. నెల జీతం తీసుకుని స్నేహితులతో షాపింగ్ కి వెళ్ళాను. కొత్త కాళ్ళ పట్టిలు తీసుకుందాం అని, అక్కడ అన్ని వెరైటిలు చూస్తున్నా కూడా పట్టీలకు చుట్టూ గజ్జలు ఉన్నవి కనిపించడం లేదు, అదే అడిగాను నేను షాప్ అతన్ని, అవ్వి ఇప్పుడు ఓల్డ్ పాషన్ మేడం అని అన్నాడు అతను. నా స్నేహితులు కూడా నన్ను ఎగాదిగా చూస్తూ అదేంటే అందరు ఇప్పుడు సన్నవి, ఒకే మువ్వ ఉన్నవి పెట్టుకుంటుంటే నువ్వేoటి అవి కావాలి అని అంటున్నావు ముసలక్కలా అంటూ ఆట పట్టించారు. నేను సిగ్గుతో నాకు కాదంటూ తప్పించుకున్నా ఇక ఏమి అనలేక అవే సన్నవి ఒకవైపున ఉన్నావె  తీసుకున్న వారి బాధ పడలేక.

రోజు రాత్రి నేను నా గదిలో పడుకుని ఎంతలా ఏడ్చానో, ఎన్ని కన్నీళ్ళు దిండులో కరిగిపోయాయో నాకు మాత్రమే తెల్సు, భగవంతుడా ఒక చిన్న కోరిక ఆడపిల్ల అయిన నాకు ఇంత చిన్న కోరికని కూడా తీర్చుకునే అవకాశాన్ని ఇవ్వవా అని దేవుణ్ణి వేడుకుంటూ అలాగే నిద్రలోకి జారుకున్నా..

ఒక సంవత్సరం తర్వాత లోహిత్ తో నా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నాకు మువ్వలు పెట్టుకోవాలనే కోరిక తిరకుండానే. రోజు రాత్రి నా జీవితంలో మొదటి రాత్రి ఆడపిల్లనుండి అమ్మగా మారే రాత్రి, ప్రతి ఆడపిల్ల కలలు కనే రాత్రి స్నేహితుల చిలిపి మాటలతో,చేష్టలతో, శరీరం వణుకుతూ లోపలి అడుగు పెట్టాను నేను. లోహిత్ నన్ను చూస్తూ అంతా బాగానే ఉంది కానీ అంటూ ఆగిపోయాడు లోహిత్. అది చూసి నేను కంగారు పడ్డాను. నేను నచ్చలేదేమో అని. కానీ దగ్గరికి వచ్చిజేబులోంచి ఒక చిన్న పాకెట్ తీసి ఇచ్చి ఇవి పెట్టుకుంటావా నా కోసం అని అన్నాడు.

నేను పాలగ్లాస్ పక్కన పెట్టి అది విప్పి చూసా, కళ్ళు  జిగేలుమంటూ వెండి పట్టిలు, వాటి చుట్టూ  గుత్తులు, గుత్తులుగా మువ్వలు ఉన్నాయి. అవి చూడగానే నా ప్రాణం లేచి వచ్చింది. గబగబా అవి తీసుకుని అక్కడే కింద కుర్చుని వాటిని పెట్టుకుoటు ఉంటె ఏడుపు తన్నుకుంటూ వచ్చింది. వెక్కి వెక్కి ఎడవసాగాను. అది చూసి లోహిత్ అయ్యో నందు ఏడవకు నీకు నచ్చక పొతే వద్దులే అన్నాడు.

కానీ నేను అతన్ని అమాంతం కౌగిలించుకున్నా, ఇక ఎవరూ ఎన్ని అన్నావీటిని, లోహిత్ ని  వదలను అని అనుకున్నా, తెల్లారి కాళ్ళ పట్టిలతో బయట తిరుగుతున్నా నాకు మా అత్తగారు మా అమ్మతో అంటున్న మాటలు వినిపించాయి. ఆడపిల్ల అలా మువ్వలు వేసుకుని సవ్వడి చేస్తూ ఇంట్లో తిరుగుతూ ఉంటె మహలక్ష్మిలా ఉంది వదినా అని, మాటలకూ మా అమ్మ ఎలా ఫీల్ అయ్యిందో కానీ నా మొహంలో మాత్రం చిరునవ్వులు పూయించింది….   

 

Related Posts

1 Comment

Comments are closed.