మువ్వన్నెల జెండా

మువ్వన్నెల జెండా

మువ్వన్నెల జెండా

స్వాతంత్ర్య భారతావని లో నాటి కలలు….
నేటి కడలి అలలలా …
ఉవ్వెత్తున ఎగిడిపడుతూనే ఉన్నాయి…
నేటికి తీరం చేరలేని ఉత్తుంగ శృంగాలై….
అభివృద్ధికి ఆమడ దూరంగా నిలిచి…
అరచేతిలో వైకుంఠం చూపి ఉదరగొడుతున్నారు ఉపన్యాసాలు…. రెపరెపలాడుతున్న
మువ్వన్నెల జెండా… సాక్షిగా ….
ఏ కల.. నిరుద్యోగ నిదుర స్వప్నాలలో కడతెరిపోయిందో… ఎవరికెరుక…?
పాల బుగ్గల మీద నీటి చారికలు ఎవరు చూశారు
బాల కార్మిక వ్యవస్థ ఎన్ని కలలను మింగేసిందో… ?
కలలన్ని కల్లలై… కన్నీటి సుడిగుండాలై…
ఎన్ని బతుకల ఆశలను చిదిమేసిందో…!
అయిన ఆగని కలల సంద్రం మరెన్నో
స్వప్నాలను సృష్టిస్తునే ఉంది……
చేరుకోవాలనే సంకల్పంతో….

– కవనవల్లి

స్నేహపరిమళం Previous post స్నేహపరిమళం
మధ్యతరగతి జీవి Next post మధ్యతరగతి జీవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *