నా ఆలోచన ధోరణి

నా ఆలోచన ధోరణి

మీ రాజకీయ పతాకాలను నా భుజాన మోపలేను
మీ కుతంత్ర నినాదాల కోసం నా గొంతు చీల్చుకోలేను
మీ స్వార్ధ పూరిత ఆశాసౌధాల నిర్మాణానికి
నాపిడికిలి బిగించలేను
మీ విద్రోహ పార్టీల అభివృద్ధికి మీ ఆహ్వాన మంత్రానంబులు
నా చెవిలో జో్రీగ పోరు
మీ వ్యక్తావ్యక్త ప్రేలాపన ప్రసంగాలతో
మీ అనాలోచిత ఉపన్యాసాలకు వెర్రివాన్నై
నా కరథాల ధ్వనులతో అవివేకాన్ని ప్రదర్శించలేను
మా శ్రీ శ్రీ చెప్పిన ప్రపంచ పద్మావ్యూహ ఆవరణంలో
అడుగుపెట్టిన నాటి నుండి
మీ సంక్షేమ సంఘాల స్పర్ధా సంఘర్షణల
ఆహ్వాన పత్రికలను అందుకుంటూనే ఉన్న
మీ వృధా సమయ సభా సధస్సులో
మీ అంతర్గత లక్ష్యాలను పసిగడుతూనే ఉన్న
మీ కపటి భావోద్వేగ ఉపన్యాసాలకు
నా రక్తాన్ని ఉరకలేయించి
ఏ అభినందన పత్రాల రచనకు నా కలాన్ని కదపలేను
మీ భూ కబ్జా పాదయాత్రలకు గాను
నా అడుగును తోడుగా వేసి మీ ఆక్రమణలను చూస్తూ
ఆకర్మసాక్షిలా నోరుమూసుకు అస్తమించలేను,
మీ అధికార దాహాలను తీర్చుకునేందుకు
మీరు విసిరే నోట్ల కట్టలను నా హస్తగతం చేసుకోలేను
మీ పార్టీ ప్రణాళికల కరపత్ర ప్రచారనకు
తీరుగాడలేను
మీ సభా సమావేశాల్లో నాకో ఉన్నత స్థానం కేటాయించాలని కోరి
నా మనసు నిఘంటువులో చేర్చుకున్న
ప్రవిమల పదాలను శోదించి
కావ్య ప్రశంసల వర్షాన్ని మీ పై కురిపించ లేను
నా జననం……
నా గమనం…..
నా వచనం….
నా ఆలోచన ధోరణులు మీరు ఎరుగరని తెలుసు
మీ పార్టీ సిద్ధాంతాలతో నా అభ్యున్నతి శూన్యమని తెలుసు
మీ సిద్ధాంతాలకు వత్తాసు పలికితే
నా గుండెమంటలతో నా గుడెసకే నిప్పెట్టి నన్ను నిరాశ్రీ్యున్ని చేసి
మీ సానుభూతిని అందిస్తారని తెలుసు కాబట్టి
మీ సిద్ధాంతాల యజ్ఞం లో సమిధను కాజాలను……

– అభినవ శ్రీ శ్రీ

Related Posts