నా అందమైన శత్రువు

నా అందమైన శత్రువు

గత రెండు నెలలుగా గమనిస్తున్నాను ఆ అమ్మాయిని ఎంతో అందంగా కనిపిస్తుంది ఎంతో ముద్దుగా సాంప్రదాయానికి వన్నె తెచ్చే విధంగా ఉంటుంది. రోజూ పొద్దుటే లేచి గుమ్మానికి పసుపు రాసి మంచిగా మంచి ముగ్గులు వేస్తుంది. పక్కిల్లె కాబట్టి తొందరగానే అంటే రెండు నెలల తర్వాత పరిచయం ఏర్పడింది నెమ్మదిగా, తను మా ఇంటికి రావడం నేను వాళ్ళ ఇంటికి వెళ్లడం జరిగేది ఇద్దరం చదివేది ఒకే తరగతి కాబట్టి నోట్స్ లు పంచుకుంటూ కలిసి చదువుకుంటూ ఉండేవాళ్ళం.

అయితే తరగతిలో ఎప్పుడు ఇద్దరికీ మార్కులు సమానంగా వచ్చేవి దాంతో టీచర్లు తలలు పట్టుకునే వారు ఎవరికి ఎక్కువ వెయ్యాలి? ఎవరికి తక్కువ వేయాలి అని ఆలోచిస్తూ ఉండేవారు అంతలా చదువులో మేము పోటీ పడే వాళ్ళం అన్నమాట. అయితే అన్ని పరీక్షలు మామూలుగా జరిగిన కూడా ఇక చివరి పరీక్షలు వచ్చేసరికి ఇద్దరం శత్రువుల తయారయ్యాము.

ఎందుకంటే ఇద్దరం బాగా చదువుతాం మార్కులు నాకన్నా ఒకరికి ఎక్కువ వచ్చిన నేను ఫీల్ అవుతాను నాకు ఎక్కువ వస్తే తను ఫీల్ అవుతుంది. అందువల్ల ఏం చేయాలో అని బాగా ఆలోచించాము అయినా సరే తగ్గేదే లేదు అని అనుకుంటూ చాలా పట్టు పట్టి చదువుకున్నాం.

టీచర్లు కూడా మాతోపాటు మమ్మల్ని ఇద్దరి పిలిచి ఈ పరీక్షలైనా మీరు మంచిగా రాయండి. ఇద్దరి మార్కులు ఒకేలా వచ్చినా పర్లేదు. మీరు ఇంత బాగా చదివి మన స్కూల్ కి పేరు తీసుకురావాలి అంటూ ప్రోత్సాహం అందించారు.

ఇక దాంతో మేము ఇద్దరం చెలరేగిపోయాము అయితే ఈసారి ఎప్పుడూ ఒకే గదిలో ఒకే చోట చదువుకునే మేము వేరువేరుగా చదువుకోవడం మొదలు పెట్టాము. ఎందుకంటే నాకే ఎక్కువ మార్కులు రావాలని నేను, తనకే ఎక్కువ మార్కులు రావాలని తను అలా ఇద్దరం ఎవరికివారు శత్రువుల తయారై ఒకరిని చూసి ఒకరం కోపం తెచ్చుకోవడం తలలు ఎగరేసుకుంటూ కోపంగా చూపించుకోవడం మొదలుపెట్టాము.

పరీక్షల రోజు రానే వచ్చింది ఇద్దరం వేర్వేరు సెంటర్లలో పరీక్షలు రాయాల్సి వచ్చింది. దానితో ఒకరినొకరం చూసుకునే అవకాశం లేదు. మొదటి రోజు ఉత్సాహంగానే వెళ్లాను అయితే రెండో రోజు నుంచి మొదలైంది అసలు సమస్య.

తను ఉంటేనేమో తనని చూస్తూ నేను ఇంకా ఎక్కువగా పరీక్షలు రాసేవాడిని తను ఎన్ని అడిషన్స్ పేపర్స్ తీసుకున్న దానికన్నా ఎక్కువ నేను తీసుకొని గబగబా రాసేవాడిని కానీ ఇక్కడ నాకు పోటీ ఎవరూ లేరు కాబట్టి నాకు చాలా పోటీ లేకపోవడం వల్ల నిరుత్సాహంగా అనిపించింది అయినా పరీక్షలన్నీ బాగానే రాశాను.

అయితే ఈ చదువుకోవడం మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలన్నా కోరికతో తనతో మాటలను తగ్గించాను తను కూడా నాతో మాటలు తగ్గించింది 24 గంటలు చదువుకుంటూనే ఉన్నాము మా పేరెంట్స్ కూడా మమ్మల్ని ఏమీ అనలేదు.

పరీక్షలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక నేను ఉండబట్ట లేక తన దగ్గరికి వెళ్లాను. తను కూడా నా కోసమే ఎదురు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. నేను రాగానే తన కళ్ళల్లో కోటి కాంతులు మెరవడం నా దృష్టి లోంచి తప్పించుకోలేకపోయింది.

రా రా కృష్ణ ఎలా రాశావు పరీక్షలు బాగా రాసావా అవును నీ సెంటర్ నా సెంటర్ దూరం కదా ఎలా రాశావు నీ పక్కనే ఎవరైనా మంచి వాళ్ళు పడ్డారా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది మేఘన.

ఆ చాలా బాగా రాశాను పర్లేదు మరి నువ్వు ఎలా రాశావు అని అడిగాను నేను. నేనా నేను కూడా బాగానే రాసాను పరీక్షలు కానీ నువ్వు నా పక్కన లేకపోవడం వల్ల ఎందుకు అంత బాగా రాయలేదని అనిపించింది అంటూ నేను చెప్పలేని మాట తను చెప్పింది.

ఇక నేను కూడా ఆపుకోలేక అవును మేఘన నువ్వు లేకపోతే నాకు కూడా పోటీ లేకపోవడం వల్ల సరిగా రాయలేదని అనిపించింది చూద్దాం ఫలితాలు ఎలా వస్తాయో అని అనుకుంటున్నాను అన్నాను నేను.

సరిపోయారు ఇద్దరూ ఒకరు లేరని ఒకరు ఉండలేరు అంటున్నారు రేపు కాలేజీలకి ఎలా వెళ్తారు మరి? అంటూ వచ్చారు మా పేరెంట్స్. ఎలా ఏముంది వదిన ఒకే కాలేజీలో జాయిన్ చేస్తే సరి అలాగే రేపు పొద్దున చదువులు అయిపోయాక ఇద్దరినీ కలిపేసి మూడు ముళ్ళు వేసేస్తే మన బాధ తీరిపోతుంది మనకు సంబంధాలు వెతికే కష్టం లేకుండా ఉంటుంది అన్నారు మా ఇద్దరి తల్లిదండ్రులు దాంతో మేమిద్దరం ఒకేసారి ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. ఏంటి దీన్ని నేను పెళ్లి చేసుకోవాలా అని నేను ఏంటి వీడిని నేను పెళ్లి చేసుకోవాలా అంటూ మేఘన ఇద్దరం పగలబడి నవ్వుకుని ఒకరికొకరం కొట్టుకున్నాం.

రోజులు ఒకేలా ఉండవు అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగవు తను వేరే హాస్టల్లో చేరిపోయింది నేను వేరే హాస్టల్లో చేరిపోయాను. అయితే మా మధ్య ఉత్తరాలు ఫోన్లు మెసేజ్లు చాటింగ్లు అంటూ ఇలా ఎన్నో గడిచాయి. తను నా అందమైన శత్రువుగా మారింది చిన్నప్పుడు పదవ తరగతిలో ఉండగా ఉన్న అమ్మాయికి ఇప్పుడు సీతాకోకచిలుకలా మారిన అమ్మాయికి ఎంతో తేడా అనిపించింది.

చదువు పూర్తయ్యాక కలుసుకున్న నాకు నా మదిలో మిగిలిన ఆలోచనలు ఏవి అబ్బా ఎంత అందంగా ఉంది ఇంత అందమైన అమ్మాయిని ఆ దేవుడు నా కోసమే సృష్టించాడేమో అనుకున్నాను. ఒకప్పుడు శత్రువుల్లా పోట్లాడుకున్న మేము ఇప్పుడు కనికనిపించగానే పరుగున వెళ్లి గట్టిగా కౌగిలించుకున్నాము. మా ప్రేమ పండింది మా కాపురం నిలబడింది నిండు నూరేళ్లు మేమిద్దరం సంతోషంగా ఉండాలని మీరు కూడా ఆశీర్వదిస్తారు కదూ…..

– భవ్యచారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress