నా భాష నవనీతం
ఉద్భవించెను తెలుగు పదం
ద్రవిడ శబ్దమున త్రిలింగ పదమున
శాతనులు తెలుగు నుడివిరని
వారికి మునుముందు కృష్ణ గోదావరి
నడుమవారై ఉండనోపు
11వ శతాబ్ది నాంది ప్రస్తావనయ్యె,
నాణ్యమైన తెలుగు యుగ విభజన
గావించే, కాళ్ళకూరు నారాయణరావు
పూజ్యపాదుడు,పంపడు, మోళిగయ్య
నాగార్జునుడు, కణ్వుడు ఆంద్రుడు
హాలుని గాథా సప్తశతి,రేనాటి చోడులు
మొదటి. శాసనం సంపూర్ణ శాసనమయ్యె
మన తెలుగు మధరమైనది,మన తెలుగు
వారికే గర్వకారణం ,తె: తెల్లని పాలవలె
స్వఛ్ఛము, లు :లుప్తమైన భావాలు కావు
గుప్తనిధులు,గు :గుడి లాంటి మనసున
దాచబడిన సంపూర్ణ భాషానిధి నా తెలుగు.
సకల భాషలలో మణీ మకుటం
మాధుర్యమున అతి మధురం
మనసు రంజింప మహిమాన్వితం
సాటి లేని మేటియైన భాష నా తెలుగు!!!
– కి. కె. తాయారు