నా బంగారం

నా బంగారం

నా బంగారానికి ప్రేమ లేఖ, 
ప్రియాతీ ప్రియమైన నా బంగారం కీ మనస్ఫూర్తిగా ప్రేమతో వ్రాయు ప్రేమ లేఖ, బంగారం నువ్వు నా జీవితంలోకీ రావడం ఆలస్యం అయినా ఇన్నిరోజులు నా జీవితంలో లేని లోటును, నువ్వు వచ్చిన కొన్నిరోజులకే నీ ప్రేమతో మరిపించేసావు.
భవిష్యత్తు లో నువ్వు నాతో మాట్లాడని రోజు వచ్చిన తట్టుకోగలను కానీ, నీ నుంచి చిన్న మెస్సేజ్ రాకపోయినా తట్టుకోలేను.
ఎందుకో తెలియదు కానీ నీ దగ్గర నేను చిన్నపిల్లగా ఉండాలనుకుంటా, నువ్వు చూపించే ప్రేమకు ఎప్పుడు చిన్నపిల్లగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.
మనం దూరం ఉండచ్చు కానీ, మన మనసులు మాత్రం ఎప్పటికి కలిసే ఉంటాయి, నీకోసం నేను, నాకోసం నువ్వు ప్రతిక్షణం ఒకరి ఆలోచనల్లో ఒకరు ఉంటూనే ఉంటాము.
నాతోనే నువ్వు, నీతోనే నేను.నాలో నే నువ్వు, నీలోనే నేను.నా శ్వాస లో నీ ఊపిరి, నీ శ్వాస లో నా ఊపిరి.
ఒక గుండె ఆగిపోయిన, మరొక గుండె ఆ మరు క్షణం మే కొట్టుకోవడం ఆగిపోతుంది బంగారం.
నేనంటూ ఈ లోకాన్ని వదిలేసే రోజంటూ వస్తే, నీ రూపాన్ని నా కళ్ళలో నింపుకొని, నీ జ్ఞాపకాలను నా ఆలోచనల్లో పదిలం చేసుకొని చివరి శ్వాసలో నీ పేరు తలుచుకొని, మరోజన్మ అంటూ ఉంటే నీకోసం పరితపిస్తూ నా ప్రాణాలను వదులుతూ, నీకోసం మరోజన్మ లోకి అడుగు పెడతా, ఆ జన్మ లోనైనా నీకోసమే బ్రతుకుతా, నీ రాక కోసం ఎదురు చూస్తా.
ఈ జన్మలో నీ రూపాన్ని కళ్ళు మూసి నా కళ్ళల్లో నింపుకుని , మరోజన్మ లో ఆ కళ్ళతో నిన్ను వెతుకుతాను, నిన్ను తప్పకుండ చేరుకుంటాను.
కోరుకున్న జీవితాన్ని నీతో పంచుకోలేకపోయినా, నీ జ్ఞాపకాలతో జీవితాంతం బ్రతికేస్తా బంగారం.
     
– ఇట్లు నీ బంగారం (కళావతి)

Related Posts